Saturday, October 31, 2026
More
    HomePoliticsHuge funds for Nalgonda development : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ అభివృద్ధి కి భారీ...

    Huge funds for Nalgonda development : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ అభివృద్ధి కి భారీ నిధులు, రూ.197.44 కో ట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్

    📰 Generate e-Paper Clip

    –ప్రపంచ బ్యాంకు సహకారంతో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి

    –70 శాతం ప్రపంచ బ్యాంకు వాటా, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు

    Huge funds for Nalgonda development : ప్రజా దీవెన, నల్ల గొం డ:నల్లగొండ నగర అభివృద్ధికి భారీ ఆర్థిక బలం చే కూ రింది. పట్టణ మౌలిక స దుపాయాలను మరింత బలో పేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అం దించాలనే లక్ష్యంతో చేపట్టనున్న నల్లగొండ అర్బన్ ట్రాన్స్‌ ఫా ర్మేషన్ ప్రాజెక్టుకు రూ.197.44 కోట్ల పరిపాలనా అనుమతి ల భిం చింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రా మ్ (TUTJP) కింద ఈ ప్రాజె క్టును అమలు చేయనున్నారు.ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని తెలంగాణ యూసీ ఎఫ్ స్టేట్ మి షన్ డైరెక్టర్ టి.కె. శ్రీదేవి ఐఏ ఎస్ అక్టోబర్ 28, 2026న ప్రొ సీడింగ్స్ నం.1093357/TUTJP/UC F/2026 ద్వారా ఉత్త ర్వులు జారీచేశారు.

    రూ.138.21 కోట్లు ప్రపంచ బ్యాంకు వాటా

    మొత్తం రూ.197.44 కోట్ల ప్రాజె క్టు వ్యయంలో 70 శాతం ని ధులు అంటే రూ.138.21 కోట్లు ప్రపంచ బ్యాంకు ద్వారా సమ కూరనున్నాయి. మిగిలిన 30 శాతం వాటాగా రూ.59.23 కోట్ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ నిధులతో నల్లగొండ పట్టణంలో ఆమోదించిన ప్రాజెక్టు పరిధి మేరకు మౌ లిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్ట నున్నారు.

    నిబంధనలకు అనుగుణంగా పనులు

    ఆమోదించిన డీపీఆర్‌లు, సాంకేతిక ప్రమాణాలు, పనుల పరి ధి, అమలు గడువులకు అనుగుణం గా ప్రాజెక్టును పూర్తి చే యాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పను లు ప్రారంభించే ముందు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల నుంచి సాంకేతిక అనుమతులు పొం దాలని, పర్యావరణ, సామాజిక భద్రతా ని బంధనలు పాటించాలని ఆదేశించింది.అలాగే పనుల నాణ్య త, ఆర్థిక నిర్వహణ, నిధు ల వినియోగం, భౌతిక పురోగతి పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చే పట్టాలని మున్సిపల్ కమిషనర్, సంబంధిత అమలు సంస్థలకు సూచించింది. అనుమతి పొం దిన ప్రాజెక్టు వ్యయానికి మించి ఖర్చు చేయరాదని, పనుల ప రిధిలో మార్పులు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పని సరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

    నగర రూపురేఖల్లో మార్పులకు అవకాశం

    ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆర్థిక సహకారంతో చే పట్టనున్న ఈ ప్రాజెక్టు నల్లగొండ పట్టణ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కింద ఆమోదిం చిన పనులు పూర్తిస్థా యిలో అ మలైతే పట్టణ మౌలిక సదుపా యాలు బలోపేతం కావడంతో పాటు పౌర సేవల మెరుగుదలకు అవకాశం కల గనుంది. మంజూరైన నిధులను సక్రమంగా వినియోగిస్తూ, ని ర్దేశిత గడువులో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబం ధిత అధికారులను ఆదేశించింది.ఇదిలా ఉం డగా ప్రధాన గణాం కాల ప్రకారం మొత్తం ప్రాజెక్టుకు రూ.197. 44 కో lట్లు కాగా ప్రపం చ బ్యాంకు వాటా 70 శాతంగా రూ.13 8.21 కోట్లు, రాష్ట్ర ప్రభు త్వ వాటా 30 శాతంతో రూ.59 .23 కోట్లుగా స్పష్ఠీకరించారు.

    Huge funds for Nalgonda development

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.