–ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యా గులు, లారీలు, హమాలీల కొర త లేకుండా చూడాలి
Nalgonda Collector Chandrasekhar: ప్రజా దీవెన, హాలియా: రైతులు భూముల నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం పొం ద వచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీ లు, హమాలీల కొరత లేకుండా చూసి, ధాన్యం కొనుగోళ్లు, లోడిం గ్ ప్రక్రియను వేగవంతం చేయాల ని అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన అను ము ల మండలం పులిమామిడి గ్రా మంలోని ఐకేపీ ధాన్యం కొను గో లు కేంద్రాన్ని సందర్శించి కొనుగో ళ్ల తీరును పరిశీలించారు. కొను గోలు కేంద్రంలో సంఘబంధం స భ్యులు, హమాలీలు గన్నీ బ్యా గుల లభ్యత, ధాన్యం కొనుగోళ్ల కు సంబంధించిన రికార్డులు, సీరి యల్ నంబర్ల నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకు న్నారు.

ఇప్పటివరకు 64 మంది రైతులు ధాన్యం తీసుకువచ్చినట్లు కొను గోలు కేంద్రం నిర్వాహకులు వివ రించగా, రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ అ న్నారు.రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సీరియల్ నంబర్ల ప్ర కారం కొనుగోలు చేయాలని, కేం ద్రంలో మద్దతు ధర వివరాలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేయా లని ఆదేశించారు. ఈ సందర్భం గా పక్కనే ఉన్న రైతు గంగయ్య ను ధాన్యం తీసుకువచ్చి ఎన్ని రో జులు అయిందని, సీరియల్ నం బర్ ఎంత అని అడిగి తెలుసుకు న్నారు. తనకు 13వ సీరియల్ నంబర్ వచ్చినట్లు రైతు తెలిపా రు. ధాన్యం కొనుగోళ్లకు అవసర మైన గన్నీ బ్యాగులను వెంటనే సరఫరా చేయాలని, లారీలను పంపించి ధాన్యాన్ని త్వరితగతి న లోడింగ్ చేయించాలని సంబం ధిత అధికారులను కలెక్టర్ ఆదే శించారు.
హమాలీ కూలీలను కూడా అం దుబాటులో ఉంచాలని, గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవా లని స్పష్టం చేశారు. ధాన్యం కొ నుగోలు కేంద్రంలో జియో ట్యాగిం గ్ ప్రక్రియను కూడా పరిశీలించా రు.అనంతరం రైతులతో మాట్లా డుతూ రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తక్కువ నీరు అవసరమయ్యే పంటలు, ఆరు తడి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. రెండు ఎక రాల భూమి ఉన్న రైతులు అవస రాన్ని బట్టి ఒక ఎకరంలో మాత్ర మే వరి సాగు చేసి, మిగిలిన భూ మిలో తక్కువ నీటితో పండించే పంటలను సాగు చేసేలా ఆలో చించాలని తెలిపారు.
సన్న రకం వరి సాగు చేయాల నుకునే రైతులు ప్రభుత్వం సూ చించిన రకాలను ఎంపిక చేసు కొని సాగు చేపట్టాలని అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధా లుగా అండగా ఉంటుందని భరో సా ఇచ్చారు.కుసుమ పంట సా గుపై రైతులు ఆసక్తి చూపాలని, గ్రామంలో కుసుమ పంటకు సం బంధించిన మార్కెటింగ్ సదు పా యాలను కల్పించేలా చర్యలు తీ సుకుంటామని , గ్రామపంచాయ తీ పరిధిలోనే మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు, పంట ప్రాసె సింగ్ చేసుకునేందుకు యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరి శీలిస్తామని చెప్పారు. రైతులు సంఘటితంగా ఏర్పడి సామూ హిక వ్యవసాయం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచిం చారు.గ్రామంలో సోలార్ విద్యు త్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో పాత వైరింగ్‌ను మార్చి, సోలార్ విద్యుత్ వ్యవస్థను సమర్థవం తంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తే విద్యుత్ వినియోగం లో ప్రయోజనం ఉంటుందని తెలి పారు.
గ్రామంలో కోతుల బెడద ఎక్కువ గా ఉందని సర్పంచ్ కలెక్టర్ దృ ష్టికి తీసుకురాగా, గ్రామపంచా యతీ నిధులతో కోతులను ప ట్టించి నల్లమల అడవుల్లో వదిలే లా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబా లను గుర్తించి వారికి మొదటి ప్రా ధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు చే ప ట్టేలా చూడాలని సర్పంచ్‌కు సూ చించారు. భవిష్యత్తులో నీటి కొ రతను అధిగమించేలా రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదే శించారు.జిల్లా వ్యవసాయ అధి కారి వినోద్ కుమార్ ,ఇన్చార్జ్ డి ప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్ కు మార్,సర్పంచ్ అరుణ, సత్యనా రాయణ రెడ్డి,ఏ ఈ ఓ మహేష్, జిపి ఓ స్వామి, నరేష్ , ఉన్నారు.
వారంలో గోదాముల నిర్మాణా నికి శంకుస్థాపన
*హాలియా* : మహిళా సంఘా ల ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్, గో దాముల నిర్మాణానికి వారంలో శం కుస్థాపన చేయాలని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన అనుము ల మండలం శ్రీనాధపురం గ్రామం లో పంట పొలాల వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడారు.ఎల్ నినో పరిస్థితుల దృ ష్ట్యా నీటి ల భ్యత తక్కువగా ఉన్నందున ఆ రుతడి పంటలు, తక్కువనీరు అ వసరమయ్యే పంట లు,మార్కె ట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని కలెక్టర్ అన్నారు. రైతులు పండించిన ఉ త్పత్తుల ను కోల్డ్ స్టోరేజ్ లలో భ ద్రపరిచి మంచి ధర వచ్చినప్పుడు అ మ్ముకోవడం ద్వారా వారి ఉత్ప త్తులకు అధిక లాభాలు పొంద వ చ్చని అన్నారు. ఇందుకు రైతు లందరూ కలిసి ముందుకు వస్తే మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో కోల్డ్ స్టోరేజ్ లు, గోదాముల ని ర్మాణానికి ప్రభుత్వం ద్వారా చ ర్యలు తీసుకుంటామని చెప్పా రు.
విబీజీ రామ్ జీ పథకం కింద గో దాముల నిర్మాణం చేపట్టేలా ప్ర ణాళిక రూపొందిస్తామని, మ హి ళా సంఘాలకు అనువైన భూమి అందుబాటులో ఉంటే వారం రో జుల్లోనే శంకుస్థాపన చేసేలా చ ర్యలు తీసుకుంటామని వెల్లడిం చారు.కోల్డ్ స్టోరేజ్, గోదాముల స దుపాయం అందుబాటులోకి వ స్తే రైతులు తమ పంట ఉత్పత్తు లను నిల్వ చేసుకొని మార్కెట్లో మంచి ధర వచ్చినప్పుడు విక్ర యించుకునే అవకాశం ఉంటుం దని తెలిపారు. ఇందుకోసం రై తులందరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గోదాముల ని ర్మా ణం, పంటల సాగు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పిం చాలని జిల్లా అధికారులను ఆ దేశించారు.
ప్రభుత్వం వ్యవసాయానికి అవ సరమైన విద్యుత్ సరఫరా అంది స్తుందని, అయితే రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసు కోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితు లకు అనుగుణంగా సాగు విధా నాలను మార్చుకుంటూ, నీటిని పొదుపుగా వినియోగించు కొని అధిక ఆదాయం వచ్చే పం టల సాగుపై దృష్టి సారించాలని రైతు లకు సూచించారు.ఎల్ నినో కార ణంగా ప్రస్తుతం అందుబాటు లో ఉన్నంత నీరు కూడా రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని, దీ ని ని దృష్టిలో పెట్టుకొని రైతులు త క్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయాలనిమార్కెట్లో డిమాండ్, ధరలు ఉన్న పంటలను గుర్తించి సాగు చేయాలని, పంట చేతికి వ చ్చే సమయానికి మార్కెట్ పరిస్థి తులు ఎలా ఉంటాయో ముందు గానే పరిశీలించాలని సూచించా రు.100 రోజుల్లో చేతికి వచ్చే పం టలకు మార్కెట్లో ఎంత మేరకు గిరాకీ ఉందో తెలుసు కొని సాగు నిర్ణయాలు తీసుకోవాలని, శ్రీరా మనవమి వరకు పరిస్థితులను గమనించి తదుపరి సాగుపై నిర్ణ యం తీసుకోవాలని రైతులకు సూచించారు.చిక్కుడు, మిను ములు, కందులు వంటి ఆ రుత డి పంటలను సాగు చేయాలని తెలిపారు.రైతుల్లో డిగ్రీలు చ దు వుకున్న వారు కూడా ఉన్నారని, వారు వ్యవసాయంలో నూతన ఆలో చనలతో ముందుకు రావాలని కలెక్టర్ పిలుపుని చ్చా రు. జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి వినోద్ కుమార్, ఉద్యాన శా ఖ అధికారి శేఖర్, డిప్యూటీ త హసిల్దార్ ప్రవీణ్ కుమార్, సర్పం చ్ మల్ రెడ్డి సీతమ్మ ఉన్నారు.
Nalgonda Collector Chandrasekhar



