Friday, November 13, 2026
More
    Homeక్రైంNagarkurnool Irrigation DEE ACB Case: బిగ్ బ్రేకింగ్, రూ.7.32 కోట్ల అక్ర మాస్తులు గుర్తింపు,...

    Nagarkurnool Irrigation DEE ACB Case: బిగ్ బ్రేకింగ్, రూ.7.32 కోట్ల అక్ర మాస్తులు గుర్తింపు, నాగర్‌కర్నూ ల్ ఇరిగేషన్ శాఖ డీఈఈపై ఏ సీ బీ కేసు, పది ప్రాంతాల్లో ఏకకా లంలో సోదాలు

    📰 Generate e-Paper Clip

    Nagarkurnool Irrigation DEE ACB Case :ప్రజా దీవెన, హైదరాబాద్ : అవినీతి అధికారుల అక్రమ సంపాదనపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి కొరడా ఝళిపించింది. నాగర్‌క ర్నూల్ జిల్లా నీటిపారుదల, సి. ఏ.డి శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రా గిరి సత్యనారాయణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన ఉద్యోగ కాలంలో అక్రమ మార్గా ల ద్వారా భారీగా ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల నే పథ్యంలో ఏసీబీ అధికారులు న వంబర్ 12న ఏకకాలంలో పది ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

    రంగారెడ్డి జిల్లా కర్మాన్‌ఘాట్‌ లో ని మాధవరం సెరెనిటీ అపార్ట్‌ మెంట్‌లో ఆయన నివాసంతో పా టు బంధువులు, స్నేహితులు, బి నామీలు, సన్నిహితులకు సం బంధించిన ప్రాంతాల్లో అధికారు లు తనిఖీలు చేపట్టారు.ఈ సో దాల్లో భారీగా స్థిర, చరాస్తు లకు సంబంధించిన పత్రాలు వెలుగు లోకి వచ్చాయి.

    గుర్తించిన ప్రధాన ఆస్తులు ఇవే

    మహేశ్వరం మండలం తుక్కుగూ డలో 342 గజాల స్థలంలో నిర్మిం చిన 5,200 చదరపు అడుగుల ట్రిప్లెక్స్ విల్లా, కర్మాన్‌ఘాట్ గేటెడ్ కమ్యూనిటీలో 3-BHK ఫ్లాట్,
    నాగోల్ రాక్‌టౌన్‌లో 2-BHK అ పార్ట్‌మెంట్, వనపర్తి జిల్లా షా పూర్ గ్రామంలో 25 ఎకరాల వ్య వసాయ భూమి, నాగర్‌కర్నూ ల్‌లో తొమ్మిది ఖాళీ స్థలాలు, షా పూర్ గ్రామంలో ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలు.

    బంగారం, వెండి.. ఐదు వాహనా లు స్వాధీనం

    సోదాల్లో సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు, 2.8 కిలో ల వెండి వస్తువులను అధికారు లు గుర్తించారు. వీటితో పాటు మహీంద్రా XUV 7XO, మహీం ద్రా TUV 300, మారుతి సెలెరి యో, హ్యుందాయ్ శాంత్రో, బొ లెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

    మార్కెట్ విలువ మరింత ఎక్కు వ

    ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల పత్రాల విలువ రూ.7,32,6 6,58 1గా ఏసీబీ అధికారులు వెల్లడిం చారు. అయితే స్థిర, చరాస్తుల వాస్తవ మార్కెట్ విలువ పత్రాల్లో పేర్కొన్న విలువ కంటే అనేక రె ట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తు న్నారు. మరికొన్ని ఆస్తులకు సం బంధించి తనిఖీలు కొనసాగుతు న్నాయి.

    అవినీతి నిరోధక చట్టం 1988లో ని సెక్షన్లు 13(1)(బి), 13(2) కిం ద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమాస్తుల వ్యవ హారంపై పూర్తి స్థాయిలో విచార ణ కొనసాగుతోంది. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

    లంచం అడిగితే 1064కు ఫిర్యా దు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చే యాలని అధికారులు సూచిం చారు.వాట్సాప్: 94404461 06, ఫేస్‌బుక్: Telangana ACB,ఎక్స్: @Telangana ACB లతో పాటు ప్రభుత్వ కా ర్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్‌ల ద్వారా కూడా ఫి ర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదా రుల పేర్లు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.అక్రమ సంపాద నపై ఏసీబీ నిఘా మరింత కఠి నం కావడంతో అవినీతి అధికా రుల్లో కలవరం మొదలైంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.