Saturday, October 24, 2026
More
    Homeనల్గొండKey Eco-Tourism Heritage Attractions in Nalgonda Panagal : బిగ్ బ్రేకింగ్, వారసత్వ, ఆధ్యాత్మిక,...

    Key Eco-Tourism Heritage Attractions in Nalgonda Panagal : బిగ్ బ్రేకింగ్, వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా పానగల్‌,పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు

    📰 Generate e-Paper Clip

     

    Heritage Attractions in Nalgonda Panagal : ప్రజా దీవె న, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేం ద్రంలోని చారిత్రక పాన గల్‌ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ పట్ట నుంది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను, సమీపంలోని జలవనరులను సమగ్రంగా సుందరీకరించి అభివృద్ధి చేసేం దుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు యువజన పు రోగతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ 2026 అక్టోబర్ 19న జీఓ ఆర్టీ నంబర్ 311 జారీ చేసింది.

    పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

    పానగల్‌ను నల్లగొండ జిల్లాలో ప్ర ముఖ వారసత్వ, ఆధ్యాత్మిక, ప ర్యావరణ పర్యాటక కేంద్రంగా తీ ర్చి దిద్దాలనే లక్ష్యంతో ఈ అభి వృద్ధి పనులకు ప్రభు త్వం ఆమోదం తెలిపింది. తెలంగా ణ పర్యాటక అ భివృద్ధి సంస్థ (TGTDC) ఇంజినీరింగ్ బృందం సం బంధిత ప్రాంతాలను పరిశీలించి, సుమారు రూ.20 కోట్ల తో ప్రాథమిక అం చనాలను రూపొందించింది. సం స్థ మేనేజిం గ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభు త్వం నిధుల మంజూరుకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది.

       ఆలయ పరిసరాలకు కొత్త రూపు

    ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం తో పాటు పరిసర ప్రాంతాలు, సమీప జలవనరుల సుం దరీక రణ, అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. ఈ పనులు పూర్త యితే పానగ ల్‌కు వచ్చే భక్తు లు, పర్యాటకులకు మరింత మె రుగైన వాతావరణం అందుబాటులోకి వచ్చే అవ కాశం ఉంది. స్థానికంగా పర్యాటక కార్యకలా పాలు పెరగడంతో పాటు ప్రాం తీయ ఆర్థికాభివృద్ధికి కూ డా ఊతం లభించవచ్చని భావిస్తు న్నారు.

    తదుపరి చర్యలు చేపట్టనున్న టిజిటిడిసి

    మంజూరైన రూ.20 కోట్లను ప ర్యాటక మౌలిక స దుపాయాల అ భివృద్ధి, కొత్త పర్యాటక యూనిట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న యూ నిట్ల అభివృద్ధి, ఆ ధునికీకరణకు కేటాయించిన ఖాతా నుంచి ఖ ర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సం బంధించి తదుపరి అవసరమైన చర్యలను హైద రాబాద్‌ లోని తెలంగాణ ప ర్యాటక అభివృద్ధి సంస్థ మేనే జింగ్ డైరెక్టర్ చేపట్టనున్నారు.చారిత్రక, ఆ ధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పాన గల్‌ ప్రాంతాన్ని ప ర్యాటక పటంలో మరింత ప్ర ముఖంగా నిలి పేం దుకు ఈ నిధుల మంజూరు కీలక ముందడుగుగా నిలవ నుంది. అయితే పనుల ప్రారంభం, పూర్తి చేసే గడువు వంటి వివరాలు తదుపరి కార్యాచరణలో వెల్లడికావాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.