Saturday, October 31, 2026
More
    HomeOpinionLet's face El Niño challenges together : ఎల్‌నినో సవాళ్లను సమిష్టి కృషితో...

    Let’s face El Niño challenges together : ఎల్‌నినో సవాళ్లను సమిష్టి కృషితో ఎదుర్కొందాం

    📰 Generate e-Paper Clip

    –ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధి కారులు సమన్వయంతో సాగాలి
    –యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయా లి
    — మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

    Let’s face El Niño challenges together : ప్రజా దీవెన, మిర్యాలగూడ: రా బోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎదు రయ్యే వాతావరణ, నీటి ఎద్దడి సవాళ్లను ప్రజలు, ప్రజాప్ర తి నిధులు, అధికారులు సమష్టి గా కృషి చేసి సమర్థవంతంగా ఎ దుర్కోవాలని మిర్యాలగూడ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలు పు నిచ్చారు. ముందస్తు ప్రణాళిక లు, ప్రజల్లో అవగాహన, నీటి పొ దుపు చర్యలతో ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించవ చ్చని ఆయ న స్పష్టం చేశారు.శుక్రవారం నల్లగొండ జిల్లా మి ర్యాలగూడలోని కళావేదికలో ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సి న ముందస్తు చర్య లపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన కార్యక్రమాని కి ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మను షులు, పశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టా లని సూ చించారు. వ్యవసాయం, నీటిపా రుదల, తాగునీరు, విద్యుత్ రం గాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలో ప్రజలను చైతన్య పరచాలని కోరారు. మిర్యాలగూడ నియోజ కవర్గంలోని 198 గ్రా మపంచాయతీలు, 48 మున్సిపల్ వా ర్డు ల్లో ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలన్నా రు.

           ఆరుతడి పంటలే ముద్దు

    నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం లేనం దున రైతులు అప్రమత్తంగా ఉండాల ని, యాసంగిలో వరి సా గుకు దూరంగా ఉండి జొన్నలు, పప్పుధా న్యాలు వంటి ఆరు తడి పంటల కు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాలు, ము న్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పా ట్లు చేయాలని, పశుగ్రాసం కొరత రాకుండా రైతులు తమ వద్ద ఉ న్న పశుగ్రాసాన్ని భద్రపరుచుకో వాలని కోరారు.వీబీజీ రామ్‌జీ పథకం కింద వర్షపు నీటి సంరక్షణ ప నులు చేపట్టాలని, ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మిం చాలని సూచించారు. బస్టాండ్లు, జనసమ్మర్థం ఎక్కువగా ఉం డే ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాల న్నారు. వచ్చే జనవరి నుంచి బీఎల్ఆర్ ఫౌండేషన్ ద్వా రా తన 12 నెలల జీతంతో ప్రజ లకు తాగునీటితో పాటు పెరు గన్నం అందిస్తా నని ప్రకటించారు.సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యద ర్శు లు గ్రామాల్లోనే ఉం టూ ప్రజల సమస్యలను పరిష్క రించాల ని కోరారు. దామరచర్ల పెద్ద చెరువును మూసి నీటితో నింపే లా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

        నీరు, విద్యుత్ పొదుపే ప్రధానo

    శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎల్‌ని నో పరిస్థితులను ఎదుర్కోవాలంటే నీరు, విద్యుత్‌ను పొదుపు గా వి నియోగించుకోవడం అత్యంత అవసరమన్నారు. యా సంగిలో వరి సాగు చేయకుండా పంటల మా ర్పిడిని పాటిం చాలని, జొన్నలు, పెసర్లు, మినుములు వంటి పం టలు సాగు చేయాలని సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకం కిం ద ఫీడర్ ఛానళ్లు, నీటి నిల్వ ని ర్మాణాలు చేపట్టాలని, ఈ అంశా లపై సర్పంచులు గ్రామాల్లో విస్తృ తంగా అవగాహన కల్పించాలని కోరారు.

      గ్రామస్థాయిలోనే పక్కాకార్యాచరణ

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లాడుతూ ఎల్‌నినో ప్రభావా న్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటి ష్టమైన ప్రణాళికలు రూపొందిం చాలని అధికారుల ను ఆదేశించా రు. గ్రామాల్లో ఉన్న నీటి వనరు లను సర్పంచు లు, గ్రామ కార్య దర్శులు ఆడిట్ చేయాలని, అం దుబాటులో ఉన్న నీటి నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయో అంచనా వేయా లన్నారు. నీటి లీ కేజీలను అరికట్టి, ప్రతి నీటి బొ ట్టును సమర్థ వంతంగా వినియో గించుకోవాలని సూచించారు. వీబీజీ రా మ్‌జీ కింద ఇంకా ప్రారం భం కాని పనులన్నింటినీ వెంటనే ప్రా రంభించాలని, నీటి నిల్వ ని ర్మాణాలు, ఎక్కువ మంది కూలీ లకు ఉపాధి కల్పించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశిం చారు. రైతు వేదికల్లో ప్రతి మంగ ళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని, శుక్రవారం జరిగే రైతుల అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకో వాలన్నారు.

    మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని, త క్కువ వ్యవధిలో చేతికొచ్చే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిం చారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిం చేం దుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి పైకప్పుపై పడే ప్రతి వర్షపు నీటిని ఇంకుడు గుంతలు, సోక్‌పిట్లు, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా భూమిలోకి మళ్లించాలని, వి ద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించాలని కోరారు. ఎల్‌ నినో ప్రభావం, దాని పర్యవ సానాలపై అన్ని మాధ్యమాల ద్వా రా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూ చిం చారు. ప్రజలను అప్రమత్తం చేయడం కోసం విస్తృత స్థాయి లో ప్రచారం చేయడం, ఫలితాలు సాధించడం ప్రధానం అని పేర్కొన్నారు.

         ప్రత్యామ్నాయాలపై అవగాహన

    స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదన పు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి ఎల్‌ నినో ప్రభావం, దాని వల్ల ఎదు రయ్యే పరిస్థితులు, చేపట్టాల్సి న ప్రత్యామ్నాయ చర్యలను వివరించారు. వ్యవసాయం, భూ గర్భ జలాలు, ఉద్యానవనం, తాగునీ రు, గ్రామీణాభివృద్ధి త దితర శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో చేప ట్ట నున్న ముందస్తు చర్యలను వివరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాల గూడ ఆర్డీవో రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్ర జాప్ర తి నిధులు తదితరులు పాల్గొన్నారు.

    Let’s face El Niño challenges together

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.