Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Komati Reddy Venkata Reddy : మంత్రి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ అంటే...

    Minister Komati Reddy Venkata Reddy : మంత్రి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ అంటే కాంగ్రెస్,కాంగ్రెస్ అంటే నల్లగొండ అని రుజువైంది

    📰 Generate e-Paper Clip

    –నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లా మున్సిపాల్టీల్లో సత్తా చాటాం
    –సీఎం రేవంత్ నాయకత్వంలో రా ష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోoది
    –బిఆర్ఎస్ ఓటమి ఒప్పుకొని ఆ త్మ విమర్శ చేసుకోవాలి
    — ప్రజాసమస్యల పరిష్కారo ఎజెం డాగా మా పాలన కొనసాగుతుంది
    –మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబె ట్టేలాహామీలన్నీ నెరవేరుస్తాం
    –రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

    Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవె న, నల్లగొండ:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రో డ్లు భవనాలు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్య క్తం చేశారు. నల్లగొండకు చే రుకుని గెలుపొందిన పార్టీ అభ్య ర్థులకు శుభాభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కా ర్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థు లం తా అభివృద్ధి కోసం కృషి చేయా లని తెలిపారు.

    ఎన్నికలలో గెలుపోటములు సహజమన్నారు. ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్ లో ఉన్న స మస్యలను తన దృ ష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. నల్ల గొండ అంటే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్ర జలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కా ర్పొరేషన్ లో మరి న్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు.వారానికి రెండు రోజులు నల్లగొండ లో నే ఉండి పేదోళ్ల కష్టాలు, సమ స్యలు నిర్వహిస్తానని పేర్కొ న్నారు.

    ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్ల డించా రు. నల్గొండ మున్సిపల్ కార్పొ రేషన్ పీఠాన్ని కాం గ్రెస్ కైవసం హ ర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలు పొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారు. ఈ కార్య క్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహ న్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీ నివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.