Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda muncipal corporation Mayor : నల్లగొండ నగరమేయర్ బుర్రిచైతన్య కీలక పిలుపు, రాజకీయాలకతీతంగా నగరాభివృద్ధికి...

    Nalgonda muncipal corporation Mayor : నల్లగొండ నగరమేయర్ బుర్రిచైతన్య కీలక పిలుపు, రాజకీయాలకతీతంగా నగరాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda muncipal corporation Mayor : ప్రజా దీవె న, నల్లగొండ: సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోన్న భవిష్యత్తు తెలంగాణలో వెలుగొందుతున్న స్మార్ట్ నగరాల్లో ఒకటిగా నల్లగొండ నగరాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా సమిష్టి కృషితో పయనిద్దామని నల్లగొండ నగర తొ లిమేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రా జకీయాలకు అతీతంగా, మన నగర అభివృద్ధి కోసం కలిసిక ట్టుగా పని చేద్దామని కీలక వ్యాఖ్య చేశారు. శనివారం జరిగి న నల్లగొండ నగర పాలక సంస్థ సాధారణ కార్పొరేషన్ స మావేశంలో ఆమె తొలికార్పోరేషన్ సమావేశంలో చేసిన ప్ర సంగంతో ఆకట్టుకున్నారు. ఆ మాటలు కేవలం ప్రసంగం కా కుండా ఒక భవిష్యత్తు విజన్ గా నిలిచాయి.

    ప్రతి సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ప్రజా కో ణం లో చూడడం ప్రారంభమైందని చెప్పారు. పారిశుధ్యం, తా గునీరు, వీధి దీపాలు ఇవి ఇకపై చిన్న సమస్యలు కాదని న గర అభివృద్ధికి పునాది అంశాలు గా మారాయన్నారు. ప్రతి డివిజన్‌ లో కార్పొరేటర్లు నేరుగా మేయర్ కార్యాలయంతో అనుసంధానమ య్యారు. సమస్యల పరిష్కారానికి డిజిట ల్ మానిటరింగ్ వ్యవస్థ ప్రవే శపెట్టబడిందని వివరించారు.

       ప్రతీ ఇంటికీ 24 గంటల కృష్ణా జలాలు…

    “ప్రతి ఇంటికి 24 గం టల తాగునీ రు” అన్న లక్ష్యం మొదట కలలా అ నిపించింది కానీ కృ షితో అది నిజ మైందన్నారు. కృష్ణానది జలాలు న గరానికి నిరంతరం అందే లా మౌ లిక వసతులు బలోపేతం చేయబ డ్డాయని, వచ్చే ఏడాదికే 24 గంట ల నీటి సరఫరా సాధ్య మవుతుo దన్నారు. వేసవిలో కరెంట్ కోతలు ఒకప్పుడు సాధారణం కానీ నగరం లో ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణంతో వి ద్యుత్ సమస్య చరిత్రలో కలిసిపో తుందన్నారు. నగర వీధులు స్మార్ట్ ఎల్ ఈడి లైట్లతో వెలిగి పోయాయన్నారు.

         ప్రకాశంబజార్ పునర్వ్యవస్థీకరణ…

    ప్రతినిత్యం రద్దీతో ట్రాఫిక్ సమస్య లతో ప్రకాశంబజార్ ప్రాం తం ఒకప్పుడు ఇబ్బందులతో నిండిపోయి ఉండేదని వీధి వ్యాపారులకు ప్ర త్యామ్నాయ స్థలాలు, కనీస సౌకర్యాలు కల్పించడంతో అక్కడి వా ణిజ్య వాతావరణం పూర్తిగా మా రిపోనుoదని వివరించారు. కార్పొరేటర్లు పారిశుధ్య సమస్య లు, దోమల నివారణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వేగం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. అధికారు లు, కమిషనర్, డిప్యూటీ మేయర్, సభ్యులoదరూ ఒకే ల క్ష్యంతో పనిచేయాలని కోరారు. ఆ రోజు సమావేశంలో వ్యక్త మైన ఆత్మీయత, సమిష్టి దృక్పథమే నేటి స్మార్ట్ నల్లగొండకు బలంగా చేకూరిందని అభిప్రాయపడ్డారు.

    నల్లగొండ కేవలం ఒక నగరం కాదని, సుస్థిర అభివృద్ధికి, ప్ర జాభాగస్వామ్యానికి ఒక మోడల్ గా నిలు వనుoదని, ఇప్ప టికీ నగర చరిత్ర లో సమస్యలపై రాజకీయాలు కాదు, పరి ష్కారాలపై ఏకమవుదామని పిలుపుతో సాధారణ సమా వే శo ఒక అసాధారణ భవిష్యత్తుకు నాందిపలికిందని భావన వ్యక్తమైంది.

    ఏ చిన్న సమస్య వచ్చినా రాజకీ యాలు పక్కన పెట్టి తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించు కోవాలని సూచించారు. మంత్రి కోమటి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి సహకారంతో మరిన్ని నిధు లు మంజూరు చేయించుకుని అభివృద్ధికి బాటలు వేద్దా మ ని పేర్కొన్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల విష యం లో ఎప్పటిక ప్పుడు కార్పొరేటర్లు స‌మ‌స్య‌ల‌ను తన దృష్టికి తీసుకువ‌చ్చి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. అదేవిధంగా నల్ల‌ గొండ పట్టణంలో ప్రజలందరికీ 24 గంటల పాటు తాగునీరు అం దించే విధంగా ప్రణాళికల రూపొందించడం జరిగింద న్నారు.

    వచ్చే ఏడాది నాటికి 24 గంటల పాటు కృష్ణా జలాలు అంది స్తామని ఆమె తెలిపారు. విద్యుత్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం చేప‌ట్ట‌డం జరిగింద ని, అందులో ఒకటి పూర్తయిందని మిగతా వాటిని కూడా త్వరలో పూర్తిచేసి వేసవిలో కరెంట్‌ సమస్య లేకుం డా పనిచేస్తామని తెలిపారు.

    ఈ సమావేశంలో కమిషనర్ బి. శరత్‌చంద్ర‌, డిప్యూటీ మే యర్ అ మేర్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, మం దడి లిఖిత సైదిరెడ్డి, రేగట్టే అండాలు లింగస్వామి, దాసరి సాయి, పేర్ల మల్లేశ్వరి, దొడ్డి రమేష్, రత్నపురం తారకమ్మ, గోపగాని స్వాతి, పెరిక యాదయ్య, ఇటుకల మంగమ్మ, ఇ బ్రహీం, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మారగోని నవీన్ గౌడ్, అ బ్బగోని కవిత, బోయిన పల్లి వేదశ్రీ, యామ కవితరాణి పా ల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.