police decoding mystery in principle murder case : బిగ్ బ్రేకింగ్, “బాబు” అనే ఒక్క మాటతో వీడిన హత్యమిస్టరీ, ప్రిన్సిపల్ ను హతమార్చింది విద్యార్థులే –కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ పోలీసులు
--కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ పోలీసులు --అదుపులో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, రూ.1.54 లక్షల న గదు, ఐఫోన్, కత్తి, సెల్ఫోన్లు స్వాధీనం --శాస్త్రీయ దర్యాప్తుతో 30 కిలో మీటర్ల పరిధిలో 70 సీసీ కెమెరా ల పరిశీలన -- నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్

police decoding mystery in principle murder case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లే పల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూ పారెడ్డి దారుణ హత్య కే సులో నల్లగొండ జిల్లా పో లీసులు సంచలన విషయాలను వెలుగు లోకి తీసుకొచ్చారు. పాఠా లు చె ప్పిన టీచర్‌పైనే ఇద్దరు పదోతరగతి విద్యా ర్థులు కక్ష పెంచుకుని, డబ్బు కోసం పక్కాప్రణాళికతో హత్య కు పాల్ప డినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో కీలకంగా మా రింది ఒకే ఒక్క మాట.. “బాబు”. హత్యకు ముం దు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా చివరిగా “బాబు” అని పలికారు.
ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో ఆమె ఎవరిని ఉద్దే శించి ఆ మాట అన్నారనే కో ణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో వి ద్యార్థులను ఆమె సాధా రణంగా “బాబు” అని పిలుస్తారనే విషయం గుర్తించిన పోలీ సులు.. దర్యాప్తును విద్యార్థుల వైపు మ ళ్లించారు. ఈ మే రకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ప్రిన్సిపల్ దారుణ హత్య పూర్వపరాలు వెల్లడించారు.
70 సీసీ కెమెరాలు.. 80 మందికి పైగా విచారణ
కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సవాలుగా తీసుకుని దేవ రకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐ దు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్ప్రింట్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆ ధారాలతోపా టు అనుమానితుల కదలికలను పోలీసులు నిశితంగా పరి శీలించారు.హత్య జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల పరిధి ని 360 డిగ్రీల కోణంలో పరి శీలించారు. సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను రాత్రిం బవళ్లు విశ్లేషించారు. ఐదు ప్రత్యేక బృందాల్లో దాదాపు 40 మంది పోలీసులు నిరంతరం పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.
పాఠశాల తెరిచిన తర్వాత విద్యార్థులపై నిఘా
ప్రిన్సిపల్ మృతికి సంతాపంగా పాఠశాలకు వరుసగా ఆరు రో జులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థుల విచారణలో కొంత ఆ లస్యం జరిగింది. పాఠశాల పు నఃప్రారంభమైన తర్వాత పోలీ సులు ఒక్కొక్క విద్యార్థిని సున్నితంగా విచా రించారు.రెండు రో జులుగా పాఠశాలకు హాజరుకాని కొంత మంది విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. జల్సాలకు అల వాటు పడిన కొందరు విద్యార్థుల కదలికలను పరిశీలించగా, సీసీ కెమెరా ఫుటేజీల్లో లభించిన ఆధారాలు ఇద్దరు విద్యా ర్థులపై అ నుమానాలను మరింత బలపరిచాయి.
దొనియాల వద్ద ఇద్దరు విద్యార్థులు అదుపులోకి
ఈ క్రమంలో నమ్మదగిన సమా చారం మేరకు బుధవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పెండ్లిపా కల “X” రో డ్డు నుంచి మల్లేపల్లి వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరు పదో తరగతి వి ద్యార్థులను దొనియాల “X” రోడ్డు వద్ద పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.వారిని విచారించి తనిఖీ చేయగా దుస్తుల్లో దాచిన సుమారు రూ.1.54 లక్షల నగదు లభించింది. స్వాధీనం చేసుకు న్న రూ.500 నోట్లలో మూ డు నో ట్లపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. నగ దు ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా.. ప్రిన్సిపల్ రూ పారెడ్డిని హత్య చే సి ఆమె వద్ద ఉన్న నగదును అ పహ రిం చినట్లు విద్యార్థులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
గత నెలలోనే కక్షకు బీజం
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు ఒకే హాస్ట ల్ గదిలో ఉంటూ జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తల్లిదండ్రులకు తెలియకుండా సెల్ఫోన్లు వినియో గిస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో సులభంగా డబ్బు సంపాదించే మార్గా లను వెతికేవారు.గత నెలలో హా స్టల్లో డబ్బుతో పట్టుబడిన సందర్భంలో ప్రిన్సిపల్ వారి తల్లిదం డ్రుల సమక్షంలో విద్యార్థులను మందలించినట్లు పోలీసు లు తెలిపారు. ఈ ఘటనతో ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకు న్నా రని దర్యాప్తు లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ వద్ద పె ద్ద మొత్తంలో న గదు ఉంటుందనే భావనతో.. సోషల్ మీడి యాలో తమకు దొరక కుండా హత్య చేయడం, ఆధారాలు మిగలకుండా తప్పించు కో వడం వంటి అంశాలపై అన్వేష ణ చేసిన అనంతరం హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీ సులు వెల్లడించారు.
వారం రోజుల రెక్కీ, ఆ తర్వాత దారుణ హత్య
హత్యకు ముందు వారం రోజుల పాటు రూపారెడ్డి కదలిక లను గమనించినట్లు పోలీసులు తెలిపారు. పథకంలో భా గంగా హత్యకు ఉపయోగించే కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశా రు.ఘటన జరిగిన రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటి కి వెళ్లిన తర్వాత బ్యా గులో నుంచి ఎరుపు రంగు హుడీ, ప్యాంట్ తీసుకుని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనం తరం ఇద్దరూ రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఒకరు బయట ఎవరైనా వస్తున్నారా అని గమని స్తుండగా.. మరొకరు ఇంటి వెను క భాగం నుం చి లోపలికి ప్రవేశించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తెరిచి ఉన్న వంటగది మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రూ పారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అ నంతరం బెడ్రూమ్లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీ సు కుని ఇంటి వెనుక గోడ దూకి ని ర్మానుష్య ప్రాంతం నుంచి పారి పోయినట్లు వెల్లడించారు. హత్య కు ఉపయోగించిన కత్తి, గ్లౌజు లు, మాస్క్, సెల్‌ఫోన్‌ను చెట్ల పొ దల్లో పడేసి కొంతదూరం వెళ్లిన తర్వాత దుస్తులు మార్చు కున్నా రని, ఎరుపు రంగు హుడీని డ్రై నేజీలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల స్వాధీనంలో కీలక ఆధారాలు
పోలీసులు అరెస్టు చేసిన నింది తుల వద్ద నుంచి రూ.1.54 లక్ష ల నగదు,మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి చేతి గ్లౌజులు,మాస్కులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చే సుకున్నా రు.ఈ కేసులో చట్టంతో సంఘర్ష ణకు వచ్చిన ఇద్ద రు 16 ఏళ్ల ప దో తరగతి విద్యార్థులను పోలీ సులు అదు పులోకి తీసుకున్నా రు. ఇద్దరూ నాగార్జున గ్రామర్ కా న్సెప్ట్ స్కూల్లో చదువుతూ హాస్టల్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందాలకు ఎస్పీ అభినందనలు
కేసును ఛేదించడంలో విశేష ప్రతి భ కనబరిచిన దేవరకొండ డీఎ స్పీ ఎం.వి. శ్రీనివాసరావు, మల్లే పల్లి సీఐ ఏ. నవీన్ కు మార్, సీ సీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మల్లేపల్లి ఎస్ఐ ఏ. రమేష్, చింతపల్లి ఎస్ఐ ఎం. రామ్మూర్తి, గుడిపల్లి ఎస్ఐ డి. నరసింహు లు, గుర్రంపొడు ఎస్ఐ ఎన్. వెం కన్న, సీసీఎస్ ఎస్ఐ యు. సురే ష్‌తో పాటు ఇతర పోలీసు అధి కారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినం దించి రివార్డులు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కే సులో లభించిన ప్రతి చిన్న ఆధా రాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ అన్ని కోణాల్లో ద ర్యాప్తు చేసిన ప్రత్యేక బృందాల కృషి అభినందనీ యమన్నా రు. నేరస్థులు ఎంత తె లివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆ ధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాన్ని ఛేదించవచ్చని స్పష్టం చేశారు.ఒక్క మాటతో మొదలైన అను మానం.. సీసీ కెమెరాల ఆ ధారాలు,శాస్త్రీయ దర్యాప్తుతో బ లపడిన అనుమానం.. చివరకు ఇద్దరు వి ద్యార్థుల అరెస్టుతో ప్రి న్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో కీల క మిస్టరీ వీడిందని పేర్కొన్నారు.





