Tuesday, September 29, 2026
More
    HomePoliticsEx Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు...

    Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్య, వికృత చేష్ట లు, విచిత్ర విన్యాలు

    📰 Generate e-Paper Clip

    Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రె డ్డి మానసిక స్థితిపై సందేహం కలు గుతుందని మాజీ మంత్రి హరీష్ రా వు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపో వడంతో ఆ ఫ్రస్టేషన్లో గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్ర భు త్వం నడపడం మాకు చేతకావ డం లేదని ముఖ్యమంత్రి మాటల్లో తేలి పోయిందన్నారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను చెప్పకనే చెప్పుకు న్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

    రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పా లనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వే యాలని అడిగాడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని అడిగారు. ఆనాడు టీ డీపీలో ఉండి వైయస్సార్ పావురా ల గుట్టలో పావురం అయ్యాడు అ ని ఎలా అన్నావు.కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి. రాజశే ఖర్ రెడ్డిని పట్టుకొని క్విడ్ ప్రోకో కిం ద లక్ష కోట్ల అవినీతి చేశాడని చె ప్పింది నువ్వే కదా.

    కాంగ్రెస్ పాలనలో తన తండ్రి చ ని పోతే దహన సంస్కారాల అనంత రం స్నానానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని చెప్పుకున్న మనిషి రేవం త్ రెడ్డి.కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంటు రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటల కరెం టు ఇచ్చారు.

    ఆరోజు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని క్షమా పణ చెప్పి నాటి కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడగాలి. రేవం త్ రెడ్డి తినే కంచంలో ఊంచే రకం.

    కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూ మ్, సచివాలయంలో కూర్చునేది నువ్వే కదా రేవంత్ రెడ్డి.కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా మూసీ కి తెస్తానని చెప్పింది నువ్వే కదా.

    అప్పులపై పూటకో మాట, చిల్లర మాటలు తప్ప రేవంత్ రెడ్డి చెప్పేది ఏం లేదు. కేసీఆర్ పాలనలో మొ త్తం చేసిన అప్పులు 2,80,000 కో ట్లు అని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇ చ్చిన సమాధానం. 11 ఆగస్టు 20 25 న బీజేపీ ఎంపీ రఘునందన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది.

    తెలంగాణ అప్పులపై అడిగింది బీ జేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభు త్వం.

    బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ టాక్స్ ఓన్ రెవిన్యూ ఆవరేజ్ గ్రోత్ రేట్ 15శాతం.సెప్టెంబర్ 20 25లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ లో జీఎస్టీ వృద్ధి రేటులో తెలంగాణ సాధించిన వృద్ధి రేటు 5 శాతం. దేశంలో చివరి స్థానంలో తెలంగాణ ఉంది. సెప్టెం బర్ 2023లో +33 తో తెలంగాణ వృద్ధిరేటు దేశంలోనే మొదటి స్థా నంలో నిలిచింది. ఎందుకు తెలం గాణ రాష్ట్రం వృద్ధిలో తిరోగమనం పడుతుంది.

    రేవంత్ రెడ్డి వసూళ్ల వల్ల, కమీషన్ల వల్ల జీఎస్టీ తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. రోడ్ టాక్స్ తగ్గింది. కేసీఆర్ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47 ,0 00కు పెరిగింది. భారతదేశంలో అ త్యధిక తలసరి ఆదాయం ఉన్న అ గ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.

    2014లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ 62,000 కోట్లు. 2023లో 2,30, 00 0 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పారు.

    హైదరాబాదుకు కేసీఆర్ ఏం చేశా డో విను రేవంత్ రెడ్డి. లిస్టు చదువు తాను. హైదరాబాదుపై కేసీఆర్ ము ద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదు.జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా. రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడుక నిపించే టీ హబ్ గాని, స్టీల్ బ్రిడ్జి గాని కేసీఆర్ గారు కట్టింది కాదా.

    ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో 100 కోట్లతో రేవంత్ రెడ్డి కొత్త నివాసం నిర్మిస్తు న్నాడు. కేసీఆర్, మున్సిపల్ మంత్రి గా కేటీఆర్ హైదరాబాదులో ఎస్టీపీ లు కట్టారు. ఈరోజు హైదరాబా దు లో వరదలు వచ్చినా నీళ్లు రాకుం డా ప్రణాళిక చేసి ఎస్టీపీలు నిర్మిం చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తల సాని శ్రీనివాస్ యాదవ్ వారి నియో జకవర్గంలో వరద బాధితులకు స హాయం అందించడానికి నన్ను పిలి చారు.

     

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాల్లో పూడిక తీయకపోవడం వ ల్ల బస్తీలో నీళ్లు వచ్చి ఇల్లు మునిగి పోయాయి అని చెప్పారు. నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల హైద రాబాదులో వరదలు వచ్చాయి. వ రదలకు కారణం నువ్వు రేవంత్ రె డ్డి.ఉద్యోగాల నోటిఫికేషన్ల పై ఊక దంపుడు ఉపన్యాసమే తప్ప ఏమి లేదు. అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటి ఫికేషన్ అయినా ఇచ్చావా రేవంత్ రెడ్డి.

     

    గాలి మాటలు తప్ప ఆరు గ్యా రెం టీల అమలు గురించి మాట్లాడడు ముఖ్యమంత్రి. పది రోజులు అసెం బ్లీ పెట్టు. ఆరు గ్యారెంటీలు, రుణ మాఫీ, రైతుబంధు మీద చర్చిద్దాం అంటే ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి పారి పోయాడు ఈ ముఖ్యమంత్రి. వికృ త చేష్టలు, విచిత్ర విన్యాసాలు త ప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయడు ఈ ముఖ్యమంత్రి.పేద ప్ర జల కన్నీళ్లు తుడిచే ఒక్క ప్రణా ళి కైనా ఈ ప్రభుత్వానికి ఉందా. కా మారెడ్డిలో వరద బాధితులకు ఒక రూపాయి అయినా విడుదల చేశా రా.వరదల్లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించారా.

    మందిని తొక్కడం మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం. ఫీజు రియంబ ర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తా రా. 3,600 కోట్ల బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పాడు. బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్న.

    8,000 కోట్లకు పైగా ఫీజు రీయిం బ ర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉ న్నాయి.కరోనా వచ్చినా కష్టం వచ్చి నా 2,508 కోట్ల ఫీజు రీయింబ ర్స్మెంట్ ను కేసీఆర్ ప్రభుత్వం చె ల్లించింది. ఈ రెండు ఏళ్లు రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు.

    ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిం చింది బీఆర్ఎస్ పార్టీ. పోయిన నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు విడుదల చేసిన బిల్లులపై శ్వేత పత్రం విడుదల చే యాలి. హర్యానా, మహారాష్ట్ర, బీ హార్ ఎన్నికల ముందు పెద్ద కాం ట్రాక్టర్ల బిల్లులను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. పిల్లల చదువు లు ముఖ్యమా, లేక కాంట్రాక్టర్ల క మిషన్ల ముఖ్యమా. ప్రభుత్వ ఉ ద్యోగులకు ఐదు డిఏలు పెం డిం గ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.

    ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారు.

    దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఫెవి కాల్ బంధం. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్ ఇంట్లో ఐటీ రైడ్లు జరి గాయి. గుర్గావ్ లో భట్టి విక్రమార్క ఇల్లు, ఆయన అత్తగారిల్లు ఉంది. ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు. బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య లో ఉన్న ఒప్పందం ఏమిటి.

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈ డీ రైడ్స్ ఐతే ఎందుకు చెప్పలేదు. ఈడీ ఎందుకు పొంగులేటిపై ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బీజేపీతో అం టకాగింది రేవంత్ రెడ్డి. బీజేపీతో చీ కటి ఒప్పందాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి.ఢిల్లీలో బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి రాజకీయాలు బయటపడ్డా యి.2023లో రెండు కోట్ల 73 లక్షల టన్నుల వరి ధాన్యము ఉత్పత్తి జరి గింది. మంత్రమేస్తే ఇంత దిగుబడి రాలే దు.

    పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, 24 గంటల కరంట్ తెచ్చి, పెం డింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాక తీయ ద్వారా చెరువుల్లో పూడి క తీ సి పంటను పెంచాము. కాళేశ్వరం కూలిందని అంటారు. హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేసామని ముఖ్యమంత్రి అంటాడు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంత ర్భాగం కాదా. 7,000 కోట్లతో మల్లన్న సాగ ర్ నుంచి హైదరాబాదుకు గోదావరి జలాలను ఎలా తెస్తావు.

    కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, సరస్వతి పంప్ హౌస్, సుం mదిళ్ల బ్యారేజీ, పార్వతి పంప్ హౌస్, నంది మేడారం రిజర్వాయ ర్, నంది మేడారం పంప్ హౌస్, గా యత్రి పంప్ హౌస్, రాంపూర్ పంప్ హౌస్, రాజేశ్వరంపేట పంప్ హౌస్, మల్కంపేట రిజర్వాయర్, మల్కం పేట పంప్ హౌస్, ముప్పల్ పంప్ హౌస్, అప్పర్ మానేరు పంప్ హౌ స్, అనంతగిరి రిజర్వాయర్, అనం తగిరి పంప్ హౌస్, రంగనాయక సా గర్ రిజర్వాయర్, రంగనాయక సా గర్ పంప్ హౌస్, మల్లన్న సాగర్ రి జర్వాయర్, మల్లన్న సాగర్ పంప్ హౌస్, కొండపోచమ్మ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్, వన్ పంప్ హౌస్ టు బస్వాపూర్ రి జర్వాయర్.

    ఇవన్నీ కూలినయా, ఇవన్నీ కనిపిం చడం లేదా రేవంత్ రెడ్డి. రిజర్వా యర్ల కింద పంట పండడం లేదా.

    పంట పండేది నిజం. రైతుల కళ్ళ ల్లో ఆనందం నిజం. అంబేద్కర్ స్ఫూర్తితో నిర్మించిన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అంబేద్కర్ పేరు ఉందని సెక్రటేరియట్ కి రేవంత్ రెడ్డి పోవడం లేదు. తెలంగాణ సోయి లేదు నీకు. తెలంగాణ ఉద్యమం గు రించి తెలవదు నీకు. సచివాలయం ఎందుకు నిర్మించామో నీకు అర్థం కాదు. ఈరోజు అది తెలంగాణ షాన్.

    తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా ప రిపాలన సౌధాన్ని నిర్మించింది బీ ఆ ర్ఎస్ ప్రభుత్వం.ఈ రాష్ట్ర చరి త్ర లో, దేశ చరిత్రలో కాంట్రాక్టర్లు బి ల్లు లు రావడం లేదని ఫైనాన్స్ డిపా ర్ట్మెంట్ ముందు ధర్నా చేసిన ఏకైక ప్రభుత్వం మీదే కావచ్చు. 10 శా తం, 20 శాతం కమిషన్ల కోసం పైర వీకారులు, బ్రోకర్లు సెక్రటేరియట్లో నిండిపోయారు. పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పా ర్టీకి లేదు.

    పీజేఆర్ ను మానసికంగా వేధించి వారి చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ కొడుకుకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు. మూడు లక్షల కో ట్ల పెట్టుబడులు తెచ్చామని రేవం త్ రెడ్డి చెప్తున్నారు అది నోరా? మో రా. రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ టీఎస్ఐపాస్ లో వివరాలు ఉన్నా యి.2024 – 25లో 13,700 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి..

    2025 – 26లో 6,472 కోట్ల పెట్టు బ డి వచ్చింది. 3 లక్షల కోట్ల పెట్టుబ డులు ఎక్కడివి.

    నప్పుతట్లు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుంది.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైంది.

    యూరియా కోసం లైన్లో నిలబడే దుస్థితి అర్థమైంది రౌడీలు పోలీ సు ల గుండెల మీద బుల్లెట్లు దింపేది అర్థమైంది.జూబ్లీహిల్స్ ఓటర్లు లై న్లు కట్టి పొద్దున్నే పోయి ఓటేయా లని డిసైడ్ అయింది.చీరలు పంచి నా, సారెలు పంచినా, పైసలు పం చిన నడువై రేవంత్ రెడ్డి. వెంక టేశ్వర కళ్యాణం పేరిట జూబ్లీ హి ల్స్ లో కాంగ్రెస్ పార్టీ చీరలు పం చు తున్నది. పనివంతుడు పందిరేస్తే కు క్క తోక తాకి కూలింది అన్నట్టుం ది రేవంత్ రెడ్డి తీరు అంటూ హరీష్ రావు తనదైన శైలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విరుచుకబడ్డారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.