
:Nampally POCSO Court sensational judgment ప్రజా దీవెన, హైదరాబాద్: తప్పించుకోలేరు…కాలం ఎంత దాటినా, నేరం ఎంత పాతబడ్డా చట్టం ముందు మోకరిల్లక తప్పదు. తొ మ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, నాంపల్లి ప్ర త్యేక పోక్సో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సమాజంలో నేర గాళ్ల గుండె ల్లో దడపుట్టించేలా నిలిచింది. 2015 నాటి సీఐ డీ కేసులో న్యాయదేవత త న పూర్తి ప్రతాపాన్ని చూపించిం ది. ఈ కే సులో కీలకపాత్ర పోషించిన ఐదుగురు ప్రధాన నిం దితులకు కోర్టు జీవితాంతం జైలు శిక్షను ఖరారు చేసింది.ఈ దారు ణంలో భాగస్వాములైన 33 మంది నేరస్తుల భవిత వ్యం జైలు నాలుగు గోడల మధ్యే తేలిపోయింది.
నిందితులకు కఠిన కారాగార వాసం
ముగ్గురు నిందితులకు 14 ఏ ళ్లు, మరో 14 మందికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. అన్యాయానికి గురైన 9 మం ది బాలికలకు న్యాయస్థానం అండ గా నిలుస్తూ ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిం చాలని ఆదేశించిం ది.ఈ తీర్పు కే వలం శిక్షల ప్రకటన మాత్రమే కాదని,పిల్లలపై అకృత్యాలకు పా ల్పడేవారికి భవిష్యత్తులో తప్పిం చుకునే దారే లేదని తెలిపే గట్టి హెచ్చరిక అని నిందితులు ఎంతటి వారైనా, దర్యాప్తు ఎంత సుదీర్ఘమైనా న్యాయం గెలిచి తీరు తుందని నాంపల్లి కోర్టు మరోసారి స్పష్టం చేసింది.




