Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రి స్థానానికి రేవంత్ రెడ్డి ప్రవ ర్తన తెలంగాణ సంస్కృతికే మా యనిమచ్చ అని మాజీ మంత్రి, సి ద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రా వు తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తా రు.రేవంత్ రెడ్డి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని, చరి త్రలో వికృత మనస్తత్వం కలిగిన బూతుల సీఎంగానే మిగిలిపోతా రని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి వికృత భాష తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు మౌనం వహించడం రాష్ట్రానికి ప్రమాదకర మని ఆందోళన వ్యక్తం చేశారు. గు రు వారం తెలంగాణ భవన్‌లో ఆ యన ఏర్పాటు చేసిన మీడి యా స మావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే…
జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరు ద్యోగులను మోసం చేసిన రేవంత్ నెలకు ఒక స్కామ్‌తో స్కాం క్యా లెండర్ అమలు చేస్తున్నారు. పా లన గాలికొదిలి, జేబులు నింపు కో వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.తన రెండున్నరేళ్ల పాలనలో ప్రజల కు చేసింది ఏమీ లేక, తన అసమ ర్థతను, వైఫల్యాలను క ప్పిపుచ్చు కోవడానికే రేవంత్ రెడ్డి వికృత భాషను ఆశ్రయి స్తున్నారు.తన కుర్చీ కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బీ జేపీ తో చీకటి ఒప్పందం చేసుకు న్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభు త్వ అవినీతిపై కేంద్రం విచారణ జరిపించడంలేదు.
రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బో నస్ ఎగ్గొట్టి రైతులను నట్టేట ముం చారు. 24 గంటల కరెంటును 12 గంటలకు కు దించారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన జాతి పిత కేసీఆర్ ని చూసి ఓర్వలేక రే వంత్ రెడ్డి విషం కక్కు తున్నా రు. అమెరికా పర్యటన తర్వాత ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుంది. రాజకీయాల్లో వి మర్శలు, ప్రతివిమర్శలు ఉండొ చ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వికృత భాషను చూసి సభ్య సమా జం ఛీకొడుతోంది. రాజకీయాల్లో విలువలు కాపాడా ల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే ఇలా చి ల్లర మాటలు మాట్లాడటం దారు ణం.కేసీఆర్ లేని తెలంగాణ ఉం దా ఈ విషయం రాష్ట్రంలో ఎవరిని అడిగి నా చెప్తారు. కేసీఆర్ ని జాతి పిత అన్నందుకు రేవంత్ రెడ్డి కడు పులో ఉన్న విషమంతా కక్కుతున్నాడు.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ను నిజం చేసింది కేసీఆర్
ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు తె చ్చి 60 లక్ష ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వాతాతలకు 2,000 పె న్షన్ ఇచ్చింది, 24 గంటల కరెంటు ఇచ్చింది, రైతు బీమా పథకం తె చ్చింది కేసీఆర్ మాత్రమే. వెయ్యి గురుకులాలు పెట్టి ఆరు లక్షల మం ది విద్యార్థులకు నాణ్యమైన విద్య నిచ్చింది కూడా ఆయనే. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం కేసీ ఆర్ ని తెలంగాణ సాధించిన వ్య క్తిగా, ప్రజల ఆకాంక్షను ని జం చేసిన జాతిపితగా పిలుచుకుంటారు.
దీన్ని చూసి రేవంత్ రెడ్డికి ఎందు కంత కడుపునొప్పి ఎందు కు నోరు పారేసుకుంటున్నాడు.రేవంత్ రెడ్డి కంటే పరుష ప దజాలంతో, బూతు లతో మేము కూడా సమాధానం చె ప్ప గలం. మాకు మాట్లాడటం రాక కాదు, నువ్వు రెచ్చగొడితే మేం రెచ్చిపోవచ్చు. కానీ మేము బాధ్యత గల శాసనస భ్యు లుగా, పౌరులుగా మాకు సంస్కారం ఉంది కాబట్టి రే వంత్ రెడ్డిలా దిగజారి మాట్లాడటం లేదు. విలువలతో కూడిన రా జకీ యం చేయాలనుకుంటున్నాం.
ప్రతి ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర చరి త్రలో ఒక పేజీ ఉంటుం ది. కానీ రే వంత్ రెడ్డి మాత్రం తెలంగాణ చరిత్రలో బూతుల ముఖ్యమంత్రిగా ని లిచిపోతాడు.రెండున్నర సంవ త్స రాల రేవంత్ రెడ్డి పాలనను గమనిస్తే, ఆయన చేసింది ఏమీ లే దు. ఈ రాష్ట్రంలో తెచ్చిన మార్పు అం తకంటే లేదు.తన పాలనపై తనకే సంతృప్తి లేక, తన చేతగా నితనాన్ని, వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బూతు భాషను ఎం చుకున్నారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన వ్య క్తిలా అదుపు తప్పి, ఆలోచనారహితంగా మాట్లా డుతున్నా డు.
ముఖ్యంగా ఈ సందర్భంలో తె లం గాణ మేధావులు స్పం దించాలి. మే ధావుల మౌనం దేశానికి, రాష్ట్రాని కి ప్రమా దం.రేవంత్ రెడ్డి వికృత భా ష, ప్రవర్తన తెలంగాణ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.దయచేసి తెలంగాణ మే ధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చ దువుకున్న వారం దరూ ఈ విషయాన్ని గమనించాలి. పా లనను గాలికి వదిలి బూతు లతో కాలం వెళ్లదీస్తున్న రేవం త్ రె డ్డి తీరును ఖండించాలి.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ చ రిత్రను చిన్నబుచ్చే ప్ర యత్నం, తె లంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్ర యత్నం చేస్తు న్నాడు. ఇది తెలం గాణ ఆత్మగౌరవంపై చేస్తున్న దాడి.
రే వంత్ రెడ్డి ఏనాడు ఉద్యమంలో లేడు, ఏనాడు జై తెలం గాణ అన లేదు. పైగా ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొ డంగల్ ప్రజలను కూడా మేము కో రుతు న్నాం, మీరు గెలిపించిన ఎ మ్మెల్యే ఏ రకంగా అదుపుతప్పి మాట్లాడుతున్నారో ఆలోచించాలి.రేవంత్ రెడ్డి ఈ రెండేళ్ల లో ఏ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనైనా, సభలోనైనా, రివ్యూ మీటింగ్ లోనైనా రైతుల గురించి మాట్లాడారా. గురుకులా ల్లో పాము కాట్లతో, కరెంట్ షాక్‌ల తో, కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణా లు పోతుంటే ఏరోజైనా స్పందిం చారా.
విద్యా కమిషన్ ఇచ్చిన రిపో ర్టు గురించి ఆలోచన చేశా రా
20 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కు సంబంధించిన ఫీజు రీయింబ ర్స్‌మెంట్ ఊసే ఎత్తరు. ఉద్యోగాలు లేక నిరుద్యో గులు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే, జాబ్ క్యాలెండర్ గురిం చి ప్రశ్నిస్తుంటే ఒక్క మా ట మాట్లాడరు.అవ్వాతాతల పెన్ష న్ల గురించి గానీ, అక్కచెల్లెళ్లకు ఇ చ్చిన హామీల గురించి గానీ మా ట్లాడరు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అం దక ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల గురించి, ఉద్యోగుల పి. ఆ ర్.సి, డి.ఏ, ఏరియర్స్ గురించి ఒ క్క రోజు కూడా మాట్లా డరు. ఇవేవీ మాట్లాడని ముఖ్యమంత్రి, కేవలం కేసీఆర్ త్యాగాన్ని, కృషిని తక్కువ చేసి చూపించే ప్ర యత్నం మాత్ర మే చేస్తాడు.ఇలాంటి వ్యక్తి ముఖ్య మంత్రి కావడం తెలం గాణ ప్రజల దౌర్భాగ్యం.
రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వ లేదు కానీ స్కాం క్యాలెం డర్ మా త్రం ఇచ్చారు. ప్రతినెలా ఉద్యోగా లు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారు.జనవరిలో సివిల్ సప్లైస్ స్కాం,ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ (Fly Ash) స్కాం, మా ర్చిలో సాండ్ (Sand) స్కాం, ఏప్రిల్‌లో ఆర్టీసీ స్కాం,మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కాం,జూన్‌లో ఫోర్త్ సిటీ (Fourth City) స్కాంజూలైలో లగచర్ల, హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కాం,ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లస్కాం,సెప్టెంబర్‌లో HILTP ఇండస్ట్రి యల్ స్కాం, అక్టో బర్‌లో పవర్ స్కామ్,నవంబర్‌లో సింగరేణి స్కాం, డి సెంబ ర్‌లో ముఖ్యమంత్రి, కేఎల్ ఎ స్ఆర్ (KLSR) స్కామ్.
ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కా నీ, రేవంత్ రెడ్డి పాలనలో నెలకు ఒక స్కామ్ మాత్రం పక్కాగా జరి గింది. తన కుంభ కోణాల గురించి మేము ప్రశ్నిస్తే, వాటిని కప్పిపు చ్చుకోవడా నికి తిట్ల దండకం అం దుకుంటాడు. స్కీములు అడిగితే డైవర్షన్, హామీలు అడిగితే డైవ ర్ష న్. ఒకటి రెండు సార్లు డైవర్షన్ చే యగలవు కానీ, ప్రతిసారి చేస్తా నం టే ప్రజలే నిన్ను ముఖ్యమంత్రి పద వి నుండి డైవర్షన్ చేస్తారు బిడ్డ జా గ్రత్త.నల్గొండ మిర్యాలగూడ సభ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ హ యాంలో SLBC ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
2014 నుండి 2023 వరకు, రెండే ళ్లు కరోనా కాలాన్ని పక్క న పెడితే, ఏడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 11. 5 కి.మీ. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప నులు పూర్తి చేసింది. కానీ ఈ రెం డున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి కనీసం 100 మీటర్ల పనులు కూడా చేయలేదు. గతంలో మీ అవినీతి, అనాలో చిత చర్యల వల్లే ఎ స్ఎల్బీసీ టన్నెల్ పనులు కుప్ప కూలా యి. ఆ ప్రమాదంలో చిక్కు కున్న శవాలను కూడా బయ టకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం కాం గ్రెస్. మేము ఎస్ఎ ల్బీసీలో అం తర్భాగమైన పెండ్లిపాక రిజర్వా యర్, దిండి రిజర్వాయర్, టన్నెల్ పనుల కోసం 4000 కోట్ల రూపా య లు ఖర్చు చేశాం.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని ఖతం చేసి, ఏం మొహం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నా రు.నల్గొండ ఫ్లో రైడ్ పాపానికి కార ణం కాంగ్రెస్ కాదా? ఆనాడు వంక రబో యిన కాళ్లతో ఫ్లోరైడ్ బాధితు లను ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టింది నిజం కాదా? కేసీఆర్ వచ్చి న తర్వాతే నల్గొండకు స్వచ్ఛమైన తాగునీరు అందించి, ఫ్లోరైడ్ రహి త జిల్లాగా మార్చారు. నాగా ర్జు నసాగర్ కాలువ అలైన్‌మెంట్ మా ర్చి నల్గొండకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే. మా ప్రభుత్వం కా లువల ఆధునికీకరణ, లిఫ్టుల మ రమ్మతులు చేసి అదనంగా లక్ష ఎ కరాలకు నీళ్లు అందించింది.
నల్గొండ పట్టణాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేసింది కేసీ ఆర్.దావోస్ వెళ్లి వచ్చినా ఎన్ని పెట్టుబడులు తె చ్చారో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో రేవంత్ రెడ్డి చెప్పలేదు. దావోస్ ప ర్యటన నుంచి వచ్చింది ఏమీ లేదు కాబట్టే ప్రెస్ మీట్ పెట్టలేదు. ఫారిన్ పోయి వచ్చినా ఆయన మాట తీ రు మా రలేదు, వికృత చేష్టలు మా రలేదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వారిస్తున్న ఫంక్షన్లో హేట్ స్పీచ్ గురించి హితబోధ చే శారు. రేవంత్ రెడ్డి తన అసలు స్వ భావాన్ని బయటపెడుతూ అదే వే దికపై విద్వేషపూరితంగా మాట్లా డారు.
రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపా డు కోవడం కోసం బీజేపీతో చీకటి ఒ ప్పందం చేసుకున్నారు. మహబూ బ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బ హుమానంగా ఇచ్చింది నువ్వే కదా రే వంత్ రెడ్డి? ముఖ్యమంత్రిగా నీకు వచ్చిన మెజారిటీ, ఎంపీ ఎన్నికల్లో ఎందుకు రాలేదు? బీజేపీ జాతీయ నాయకులు వచ్చి ఆర్ఆర్ టాక్స్ అని అవినీతి గురించి మాట్లాడ తా రు తప్ప, ఎలాంటి ఎంక్వైరీ చేయ రు.పొంగులేటి ఇంటిపై, ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ, ఈడీ రైడ్లు జరిగితే ఆ వివరా లు ఎందుకు బయటకు రావడం లేదు.
ఇది కాంగ్రెస్-బీజేపీల చీకటి ఒ ప్పందానికి నిదర్శనం కాదా
తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ ఉన్న ప్పు డు కన్నెత్తి చూడని అదానీ, ఇప్పు డు పంప్డ్ స్టోరే జ్ ప్రాజెక్టుల పేరుతో విద్యుత్ శాఖలో యాక్టివ్ ప్రపో జ ల్స్ ఉన్నాయి.కాళేశ్వరం మీద, మిషన్ కాకతీయ మీద కూడా తప్పుడు కూతలు కూస్తున్నారు. ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది? కాళేశ్వరం, మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ ‘రైస్ బౌల్’ అయిందని చెప్పింది. ఈరోజు తెలంగాణ దేశా నికి అన్నం పెడుతోందంటే అది కేసీ ఆర్ కృషి. రండి సిద్దిపేటలో చూ పిస్తా, కాలువల్లో నీళ్లు పారుతు న్నాయో లేదో. ఇప్పు డు కాంగ్రెస్ పాలనలో కేవలం 12 గంటల కరెం టు మాత్రమే వస్తోంది, ఫ్రీ కరెంట్ ను ఉత్త కరెంట్‌గా మార్చారు. 24 గంట ల కరెంటు పేటెంట్ కేసీఆర్ ది మాత్రమే.
రుణమాఫీ గురించి వేములవాడ రాజన్న మీద ఒట్టేసి చె ప్పాడు. ఎ క్కడ పూర్తి రుణమాఫీ చేశావో చూ పించు. అదే చొప్పదండిలో ఎక్క డి కి రమ్మంటావో చెప్పు లేదా కొడంగ ల్ కి రమ్మంటావా చెప్పు ఎక్కడ పూర్తి రుణమాఫీ చేశావో చూపిం చు రేవంత్ రెడ్డి. రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టా వు, యాసంగి సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టావు.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చె ప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రెస్ క్లబ్ కైనా, నువ్వు ఎక్కడికి ర మ్మంటే అక్కడికి వస్తా.. ఆ 25 వేల కోట్లు ఎక్కడ ఇచ్చావో చూపించు.
మా ప్రభుత్వంలో ఇచ్చిన 5 లక్షల వడ్డీ లేని రుణాలనే కాంగ్రెస్ కొన సాగిస్తోంది తప్ప కొత్తగా చేసింది లే దు. కేసీఆర్ పేరు పలకకుండా రే వంత్ రెడ్డి మాట్లాడలేకపోతున్నా రని హరీష్ రావు ఫైర్ అయ్యారు.


