
Minister Komatireddy Venkat Reddy :ప్రజా దీవెన, నల్లగొండ: భారతదే శాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దార్శనిక నాయకుడు, మాజీ ప్ర ధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు నల్ల గొండలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులోని రాజీవ్ గాంధీ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు.అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లా డుతూ రాజీ వ్ గాంధీ దేశానికి అం దించిన సేవలను, ఆయ న దూరదృష్టిని గుర్తుచేశారు. టెలి కాం, ఐటీ రంగాల్లో విప్ల వాత్మక మార్పు లకు రాజీవ్ గాంధీ పునాది వేశారని, నేటి డి జిటల్ భారతానికి ఆయన ఆలోచ నలే బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు.
యువతకు పెద్దపీట వేసిన నాయకుడు
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని విశ్వసించిన రా జీవ్ గాంధీ..ఓటు హక్కు వయో ప రిమితిని 21ఏళ్ల నుంచి 18 ఏ ళ్లకు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు. యువతకు రా జకీయ ప్రాధాన్యత కల్పించిన నాయకుడిగా ఆయన చరిత్ర లో నిలిచిపోయారని అన్నారు.దేశ సమగ్రత, శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం సేవలను మంత్రి కొని యాడారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఆ కుటుంబ వా ర సత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పి లుపునిచ్చారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ శ్రేణుల ప్రధా న లక్ష్యం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పి లుపునిచ్చా రు. ఇందుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకిత భావంతో పనిచే యాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు కోసం ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన సోని యా గాంధీని తెలంగాణ ఇచ్చిన దేవతగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని, ప్రజలను విభజించే రాజకీయాలకు ప్రజలే తగిన సమా ధా నం చెబుతారని మంత్రి అన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను కొన సాగిస్తూ.. కాంగ్రెస్ భవిష్య త్ రాజకీయాలకు యువతను సిద్ధం చేయాలనే సంకల్పా న్ని ఈ వే డు కల వేదికగా నాయకులు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అ మేర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, సీనియర్ నా యకులు బుర్రి శ్రీనివాసరెడ్డి, గు మ్ముల మోహన్ రెడ్డి, వం గూరి లక్ష్మయ్య, అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అ ధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, నర్సింగ్ శ్రీనివాస గౌడ్, కార్పొ రేటర్ ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేక ల ప్రమోద్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాం గ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కా ర్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






