Monday, September 28, 2026
More
    HomePoliticsPM Narendra Modi : ప్రధాని మోదీ కీలకవ్యాఖ్య, యుద్ధ మేఘాలు అలుముకున్నా భారతీ యులకు...

    PM Narendra Modi : ప్రధాని మోదీ కీలకవ్యాఖ్య, యుద్ధ మేఘాలు అలుముకున్నా భారతీ యులకు ‘కవచం’లా కేంద్ర ప్రభు త్వం 

    📰 Generate e-Paper Clip

    PM Narendra Modi : ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ప్రధాని న రేంద్ర మోదీ దేశ భవిష్యత్తుపై ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిం చారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు (Supply Chain) అస్తవ్య స్తమైనా, యుద్ధ మేఘాలు చము రు ధరలను ఉడికించినా భారతీ యులపై ఆ భారం పడకుండా ప్ర భుత్వం ఒక ‘కవచం’లా నిలిచింద ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉ ద్ఘాటించారు. ఈ ప్రసంగంలో అంద రినీ ఆశ్చర్యపరిచిన, ఆలోచింప జేసిన అంశంగా బంగారంపై విరా మం ప్రకటన నిలిచింది. అంతర్జాతీ య పరిస్థితుల వల్ల బంగారం ధర లు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్ర ధాని ఒక సాహసోపేతమైన పిలు పునిచ్చారు. శుభకార్యాలు, పండు గలకు బంగారం కొనుగోళ్లను ఏడా ది పాటు వాయిదా వేయాలని కో రారు.

    బంగారం దిగుమతులు తగ్గితే, మ న దేశ విదేశీ మారక ద్రవ్యం (For eign Exchange) ఆదా అవు తుంది. ఇది రూపాయి విలువను పెంచడమే కాకుండా దేశ ఆర్థిక వ్య వస్థను మరింత బలోపేతం చే స్తుం ది. చమురు దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించేందుకు మోదీ డ బుల్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు.

    ఇతర దేశాలతో దౌత్యపరమైన చ ర్చలు జరిపి పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉంచడంతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను భా రీగా ప్రోత్సహించడం,రైల్వేల్లో డీజి ల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి వి ద్యుదీకరణ వైపు అడుగులు వేయ డం, త్వరలోనే పెట్రోల్, డీజిల్ అవ సరం మనకు నామమాత్రంగా మా రుతుందని, ఆ మిగిలిన విదేశీ మా రక ద్రవ్యమే మనల్ని అగ్రరాజ్యంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    *అన్నదాతకు అండగా*

    ప్రపంచవ్యాప్తంగా యూరియా బ స్తా ధర రూ. 3,000 పలుకుతుం టే, భారత్‌లో మాత్రం సబ్సిడీ పు ణ్యమా అని రైతులకు రూ. 300 లోపే అందుతోందని మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ సంక్షోభంలోనూ సామాన్యుడిని కాపాడటమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. కేవ లం ప్రభుత్వం మార్పు తెస్తే సరి పో దు, ప్రజలు కూడా తమ ‘బంగారు’ అలవాట్లను మార్చుకొని దేశ నిర్మా ణంలో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరు తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.