Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, క నగల్: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలులో రైతులను ఇ బ్బం ది పెడితే సహించేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి అన్నారు. ఆ రుగాలం క ష్ట పడి పంట పండించిన రైతును కొనుగోలు దా రులు లేదా మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హె చ్చరించారు. ఎండలను దృష్టి లో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెం టవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆ య న అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి నల్ల గొం డ జిల్లా నల్లగొండ, కనగల్ మండలాలలో ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాక ఇదివరకే ప్రారం భించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ముందుగా నల్గొండ మండలం జి. చెన్నారం గ్రామం శివారు లో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రా రంభించారు. అ నంతరం కనగల్ మండల కేంద్రంలో ఏ ర్పా టు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేసి ధాన్యం కొనుగోలుకు సంబం ధించిన వివరాలను అడి గి తెలుసుకున్నారు. లారీల సమస్య ఉన్నట్లు నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి కనగల్ మండల కేంద్రంలో అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలని, ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేసిన ధాన్యం ఆ గడానికి వీలులేదని, కనగల్ లో 6, జి.ఎడవల్లిల్లో 8 లారీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలమైనందున ధాన్యం తే మ శాతంలో ఎలాంటి ఇ బ్బంది లేదని, అలాగే తాలు, తరు గు సమస్య కూడా లేనందున కొ నుగోలు కేంద్రాలకు వచ్చిన ధా న్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని, అవసర మై తే రాత్రి స మయంలో లైట్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొ నుగోలు చేసి పంపిం చా లన్నారు. హమాలీల సమస్య లే కుండా చూసుకోవాలని చెప్పారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, క్షేత్రస్థా యిలో జిల్లా కలెక్టర్ తో పాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాలు, మార్కె టింగ్, వ్యవసాయ రెవెన్యూ అధి కారులందరూ ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని, ట్రా న్స్పోర్ట్ హమాలీలు, ఇతర సదుపాయాల సౌకర్యాల సమ స్య లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగు తున్నదని మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయ మై రైతులు ఎక్కడ ధర్నాలు చే యాల్సిన అవసరం లేదని, గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలుకు రైతులు ఎం తో ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. ధాన్యం కొను హులుకై జిల్లాలో ఐకెపి , పిఎసిఎస్ ల ద్వారా కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించడం జరిగిందని, నల్గొండ ,మిర్యాలగూడ ప్రాం తంలో అత్యధికంగా ధాన్యం వచ్చే ప్రాంతాలలో వీటిని ప్రారంభించిన ట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సం బంధించి రైస్ మిల్లర్లు స మస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, పౌరసరఫరాల మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేసి త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చే యాలని పునరు ద్గాటించారు. ఇందుకుగాను కొను గోలు కేంద్రాలను రైస్ మిల్లులకు ముందే టాగింగ్ చేయడం జరి గిందని, ప్రతి రోజు ధాన్యం కొనుగోలను పర్యవేక్షించడం జ రుగుతున్నదని తెలిపారు. తమది రైతు ప్రభుత్వమని, రైతు పండించిన సన్న ధా న్యానికి 500 రూపాయల బోనస్ కూ డా ఇవ్వడం జరిగిందని, దొడ్డు ధాన్యం రేటు కూడా పెంచా మని తెలిపారు. ఐకెపి మహిళా సంఘాలకు ధాన్యం నిల్వ ఉంచేందుకు 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గో దాముల ను నిర్మిస్తామని అన్నారు. జిల్లాలో ఏఎమ్ఆర్పి కా ల్వల ద్వారా ధాన్యం అత్యధికంగా పండించడం జరుగుతు న్నదని, ఎ స్ఎల్బీసీ పూర్తి అయితే ఇంకా ఎక్కువ ధాన్యం వస్తుందన్నారు. 45 0 కోట్ల రూపాయలతో ఎంఆర్పి కా లు వల లైనింగును చేపట్టడం జరి గిందని, పూర్తిస్థాయిలో కా లువలకు నీరు వస్తే కనగల్ చెరువును నింపుతామని, అధి కారులు, మిల్ల ర్లు రైతులకు సహకరించాలని, ఏ ఒక్క రైతు ను ఇబ్బంది పెట్టవద్దని, వారం రోజులపాటు రాత్రి, పగలు అందరూ కష్టపడి పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు.
ఈ విషయంలో రైస్ మిల్లర్లు ప్రభు త్వానికి పూర్తి సహకారం అందిం చాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్ర తిరోజు ధాన్యం కొ నుగోలుపై వీడి యో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పు డు సమీక్షించాలన్నారు. అనంత రం మంత్రి కనగల్ మండలం జి. ఎడవల్లి, కురంపల్లిలలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎ మ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, రెవె న్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లాపౌర సరఫరాల అ ధికారి వెంకటేశం, జిల్లా సహకార అధికారి పత్యానాయక్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,మార్కెటింగ్ శాఖ ఏ డి ఛాయాదేవి, మండలాల ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తది తరులు మంత్రి వెంట ఉన్నారు.



