Dubai Crash Claims Seven Indian Lives: దుబాయ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం భారతీయ కుటుంబాల్లో (Indian Families) విషాదాన్ని నింపింది. కార్మికులను తీ సుకెళ్తున్న మినీబస్సు అదుపు తప్పి రోడ్డుపై నిలిచి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఏడుగురు భా రతీయులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స (Hospital Treatment)పొందుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సాంకేతిక సమస్య కారణం గా ట్రక్కు రహదారిపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మినీబస్సు డ్రైవర్ (M ini Bus Driver) సరైన భద్రతా దూరం పాటించకపోవడం తో ప్రమాదం చోటుచేసుకున్నట్లు దుబాయ్ ట్రాఫిక్ అధికా రులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది సం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికి త్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు (Minor W ounds) అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ (Indian Co nsulate) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో చి కిత్స పొందుతున్న బాధితులను భారత అధికారులు పరా మర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలి యజేస్తూ బాధితులకు అవసరమైన సహాయం అందించేం దుకు స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తున్న ట్లు వెల్లడించారు.
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయ కార్మికులు ఈ ప్రమాదానికి బలికావడం బాధాకరమని పలువురు అభిప్రా యపడుతున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణా లపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన దుబాయ్‌లోని భారతీయ సమాజాన్ని తీవ్రంగా కలచివే సింది.

