నల్లగొండజిల్లా తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ
Nalagonda District Collecter, Sp: ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ యార్డులోని ధాన్యం కొను గోలు కేంద్రంలో టా ర్పాలిన్లు,లారీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిం చినందుకుగాను ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురు వా రం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి తిప్పర్తి మా ర్కెట్ యార్డులోని ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేశా రు. తుఫాను కారణంగా గత రెండు, మూడు రోజులు గా వర్షం వ ల్ల కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కొంత మంది రైతులనుండి ధాన్యం కొన్నప్పటికి సకాలంలో లారీ రాకపోవటం, టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయింది. సెంటర్ ఇన్చా ర్జి తమకు టార్పాలిన్లు ఇవ్వలేదని, కొన్న ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయలేదని రైతులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చే సారు. ఈ విషయంపై ఆగ్ర హిం చిన కలెక్టర్ కొనుగోలు కేంద్రం నిర్వ హణలో నిర్లక్ష్యం వహించినం దుకు గాను కేంద్రం ఇంచార్జ్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.
ధాన్యంకొనుగోలు కేంద్రాల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని, దీనివల్ల ధా న్యం తడిసిపోయి రైతులు ఇ బ్బందులు పడతారని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ అద నపు కలెక్టర్ జే. శ్రీని వాస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రె డ్డి , డి ఎస్ ఓ వెంకటేష్, పౌరసర ఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ , మార్కె టిం గ్ ఏడి ఛాయాదేవి, డిసి సిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి ఉన్నారు.
*మాడుగులపల్లి లో కలెక్టర్, ఎ స్పీ ఆకస్మిక తనిఖీ…* వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. గురు వారం ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలిసి నల్గొండ జిల్లా మా డుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కాగా మొంథా తుఫాను కారణంగా గడచిన రెండు రోజులుగా కురు స్తున్న వర్షాలకు ఐకెపి కేంద్రంలోని ధా న్యం తడిసి రంగు మారిపో గా ధాన్యం కొనుగోలు విషయంలో చిరుమర్తి కొనుగోలు కేంద్రానికి అనుసం ధానం చేసిన రైస్ మిల్లుతో సమ న్వయం చేసుకుని ధా న్యం దించుకునేలా చూడాలని డిఆర్ డిఓ శేఖ ర్ రెడ్డికి సూచించా రు. ఎక్కువ రో జులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచవద్దని, వ ర్షాలను దృష్టిలో ఉం చుకొని దాన్యం తడవకుండా టార్పాలిన్లు క ప్పిఉంచాలని చెప్పారు.
టార్పాలిన్లు,లారీల సమస్య లే కుండా ముందే చూసుకోవాలన్నా రు. నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించే ఏర్పాటు చే యాలని ఆదేశించారు. అయితే ఈ కేంద్రంలో కేవలం నలుగురు రైతు లకు చెందిన ధాన్యం మాత్ర మే వర్షానికి తడిసిపోయి రంగుమారి పోయినట్లు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జి ల్లా కలెక్టర్ కు వివరించారు. కొను గో లు కేంద్రాలలో వర్షా నికి ధాన్యం తడవకుండా అవసరమైన అన్నిచర్యలు తీసుకో వాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అదనపు క లెక్టర్ జే. శ్రీనివాస్, డి ఎస్ఓ వెంకతేష్, పౌరసరఫరాల డి ఎం గోపి కృష్ణ, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.


