Andhra Pradesh Road Accident : ప్రజా దీవెన, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర మాదం చోటు చేసుకుoది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల బత్తలూరు వద్ద ఓ క్వాలీస్ వాహనం అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిం ది. దీంతో నలుగురు ఘటనా స్థలం లోనే మృత్యువాత పడ్డారు. ఈ ప్ర మాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకొని మృ త దేహాలను వెలికి తీసి శవ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదo లో మర ణించిన వారిని హైదరాబాద్ నిజాం పేటకు చెందిన గుండేరావు, నరసిం హ, శ్రావణ్, బన్నీగా పోలీసులు గు ర్తించారు. తీవ్రంగా గాయపడిన మ రో ఇద్దరిని సమీపంలోని హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వీ రంతా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో హై దరాబాద్ వెళ్తుండగా ఈప్రమాదం సంభవించింది.
*మరో ప్రమాదంలో ముగ్గురు మృతి…* ఆంధ్రప్రదేశ్ లోని గుం టూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరి ధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న కా రును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో సంభవించిన ఈ ప్రమా దంలో ముగ్గురు అక్కడికక్కడే దు ర్మరణం పాలయ్యారు.
ఇదిలా ఉండగా మృతులoతా తె లంగాణలోని సూర్యాపేట ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆ స్పత్రి మార్చూరీకి తరలించారు. దీంతో ముగ్గురు మృతుల కుటుం బాలు విషాద ఛాయల్లో మునిగా యి.
