Mahatma Gandhi University Nalgonda : ప్రజా దీవె న, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగంతో పాటు ఎంఎస్ఎన్ లేబరేటరీస్, హైదరా బా ద్ ఆధ్వర్యంలో “రీసెంట్ అడ్వా న్సెస్ ఇన్ ఫార్మా స్యూ టిక ల్ కెమిస్ట్రీ–2026” అంశంపై నిర్వహించిన సదస్సుకు ము ఖ్యఅతిథులుగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హు స్సేన్, ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ అహ్మద్ క మాల్ హైదరా బాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డి.బి. రామ చారి విద్యార్థులను పరిశోధకులను ఉద్దేశించి ప్రసంగించా రు.
ఈ సందర్భంగా ఆచార్య ఖాజా అ ల్తాఫ్ హుస్సేన్ మాట్లా డుతూ రసాయన శాస్త్ర విభాగంలో ఉన్న ఆధునిక ప్రయోగ శాలలు, గ్రంథాలయ సదుపాయాలను విద్యార్థులు అ వకా శంగా వినియోగించుకొని ప రిశోధనలపై దృష్టి సారించాల న్నారు. విశ్వ వేదికపై ఫార్మా రంగంలో అనేక అద్భుత ప్ర యోగాలకు కేంద్రంగా హైదరాబాద్ రూపాంతరం చెందడం అవకాశంగా భావించాలన్నారు.
ప్రొఫెసర్ అహ్మద్ కమాల్ మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ లో ఉన్న అవకాశాలను వివరించి, హైదరాబాద్ నగ రం ఔషధ పరిశ్ర మలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందిం దని తెలిపారు.అలాగే ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి ప్రాచీన కాలం నుంచి ఆధునిక దశవరకు ఔషధ రంగంలో ప్రయోగా లు విజయాలను వివరించారు. ప్రొఫెసర్ డి.బి.రామచారి భారతీయ శాస్త్రవేత్తల పేర్లతో ప్రసిద్ధి చెందిన రసాయనిక ప్ర తిక్రియలపై వివరించి, వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.
క ళాశాల ప్రిన్సిపాల్, ఎంఎస్ఎన్ లే బరేటరీస్ చైర్,చైర్ పర్స న్ ఆచార్య వసంత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్ట ర్ వై.ప్రశాంతి, డా. జ్యోతి, డా.డి. రమేష్, డా. ఆర్. రూపా, డా. ఎస్. కళ్యాణి,డా. ఏ. శ్రీధర్ రావు, డా. ఏ. తిరుపతయ్య, డా. జె. శంకరాచారి, డా. కె. అమ రేందర్, పరిమళ మహతి, ఆయే షాబేగం తదితరులు పాల్గొన్నారు.
ఎంజీయూలో మెగాజాబ్ మేళాపోస్టర్ ఆవిష్కరించిన ఉపకులపతి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన జాబ్ మే ళా పోస్టర్ ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొన నున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డై రెక్టర్ డా హరీష్ కుమార్ తెలిపా రు. ఐటీ,ఫార్మా,అగ్రికల్చర్ బ్యాం కింగ్ రంగాలలోసుమారు 1500 ఉ ద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ యన తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లమో, ఇంజనీరింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీకాం, బీఫార్మ, ఎంబీఏ, ఎంసీఏ ఎం ఎస్ సి, డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు సై తం పోస్టర్లు పొందుపరిచి న క్యూ ఆర్ కోడ్ తో రిజిస్ట్రేషన్ చేసుకొని తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చని ఆయన తెలిపారు.
పూర్తి వివరాలకు 7095922360, 9989260671, 9502 771776, 9642676777, 9704810880 సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొ ప్పుల అంజిరెడ్డి, మే నే జ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచా ర్య శ్రీదేవి, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా హరీష్ కుమార్, ఇంజనీరింగ్ డీన్ ఆచార్య రేఖ,ఐక్యూ ఏసి డైరెక్టర్ డా మిర్యాల రమేష్, డా నీలకంఠం శేఖర్, నాగరాజు, సత్యనారాయణ రెడ్డి, వెంక ట్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


