— గతంలోనూ రూ.5 లక్షల లంచంతో పట్టుబ డిన అధికారి
Disproportionate assets case registered against Keesara Inspector : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎ దుర్కొంటున్న మేడ్చల్-మల్కాజ్గిరి పోలీస్ కమి షనరేట్ పరిధిలోని కీసర పో లీస్ స్టేషన్ ఇన్స్పె క్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై తెలంగాణ అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక చర్య చేప ట్టింది. ఆయన ఆ దాయానికి మించి ఆస్తులు కూ డబెట్టి నట్లు గుర్తించి అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆయనకు సం బంధిం చిన ఆస్తుల విలువ రూ. 2,28,50,000గా ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది.
ఐదు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
2026 అక్టోబర్ 17న ఇన్స్పెక్టర్ నివాసం, కార్యాల యంతో పాటు ఆయన బంధువులు, సన్నిహి తు లు, బినామీలకు సంబంధిం చిన మరో నాలుగు ప్రాంతాల్లో ఏ సీబీ సిటీ రేంజ్-1 అధికారులు సోదా లు నిర్వహించారు. ఈ త నిఖీల్లో పలు స్థిర, చర ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమై నట్లు తెలిపారు.
వెలుగులోకి వచ్చిన ఆస్తుల వివరాలు
సోదాలు, ప్రాథమిక విచారణలో గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. లింగోజిగూడ, స రూర్ నగర్ లో 150 చదరపు గ జాల విస్తీర్ణంలో పాత ఇ ల్లు ఉన్న రెండు ప్లాట్లు అంచనా విలువ రూ.30 లక్షలతో మన్సూరా బా ద్, ఎల్బీనగర్ లో సీఆర్ ఎన్క్లే వ్లో 240 చదరపు గజాల స్థలం లో పాత ఇల్లు అంచనా విలువ రూ.40 లక్షలు కాగా పేరూ రు గ్రా మం 180 చదరపు గజాల స్థలంలో నిర్మాణ దశలో ఉన్న ఇల్లు అంచనా విలువ రూ.50 లక్షలు, అదే విధంగా హాలియా, మిర్యాలగూడ సమీపంలో రెండు ఎకరా ల వ్యవసాయ భూమి – అంచనా వి లువ రూ.80 లక్షలుగా నిర్దారించారు. ఇవే కాకుం డా హా లియా ప్రాంతంలో మరికొన్ని వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్ల డైందని ఏసీబీ తెలిపింది. ఆయా ఆస్తుల వాస్తవ మార్కెట్ విలువ, అధి కారిక రికార్డుల్లో నమోదైన విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
నగదు, బంగారం, కారు స్వాధీనం
సోదాల సమయంలో రూ.7 లక్ష ల నగదు, సుమా రు రూ.5 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆ భరణాలు, సుమారు రూ.6. 50 లక్షల విలువైన మారుతి విటారా బ్రెజ్జా కారు, రూ.10 లక్షల విలువై న గృహోపకరణాలు, ఎల క్ట్రానిక్ పరికరాలను గు ర్తించారు. మరికొన్ని ఆస్తులకు సంబంధించిన వివ రాలపై విచారణ కొనసాగుతోంది.
గతంలో రూ.5 లక్షల లంచoతో…
ఇన్స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు గతంలోనూ ఏసీబీకి చిక్కా రు. 2026 సెప్టెంబర్ 16న ఒక అ ధికారిక పని పూర్తి చేసేందుకు రూ.8 లక్షలు లం చంగా డిమాండ్ చేసి, తన కింద పనిచేసే ఎస్ఐ డి. జ్ఞానేందర్ రెడ్డి ద్వారా రూ.5 లక్షలు తీసుకుం టుం డగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకు న్నారు.ఈ కేసులో సెప్టెం బ ర్ 17న ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తు తం ఆయన చంచల్గూడ సెంట్రల్ జైలులో ఉన్నా రు. తాజా అక్రమాస్తుల కేసులో ఆయనను పీటీ వా రెంట్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచేందుకు అ ధికారులు చర్యలు చేపట్టనున్నారు.
అవినీతిపై ఫిర్యాదు చేయండి
ఈ కేసును అవినీతి నిరోధక చ ట్టం, 1988లోని 2018 సవర ణల ప్రకారం సెక్షన్లు 13(1)(b), 13(2 ) కింద నమోదు చేశారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు లో ఉంది. నిందితుడిపై వచ్చిన ఆరోపణ లు, ఆస్తు ల విలువకు సంబంధిం చిన అంశాలు తదుపరి వి చారణ లో తేలాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Disproportionate assets case registered against Keesara Inspector


