Sunday, October 18, 2026
More
    HomeOpinionMLC Ketavath Shankar Naik : కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలే వెన్ను దన్ను

    MLC Ketavath Shankar Naik : కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలే వెన్ను దన్ను

    📰 Generate e-Paper Clip

    –గ్రామస్థాయి నుంచి ఆదివాసీ కమిటీల బలోపేతం

    — ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్

    MLC Ketavath Shankar Naik : ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, పార్టీని క్షేత్ర స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు గ్రా మస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆదివాసీ కమిటీలను ఏ ర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. నల్లగొండలోని మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంఘటన్ సృజన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రా ష్ట్రస్థాయి ఆది వాసీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ఆదివాసీ నాయకత్వానికి ప్రాధాన్యం, రాబోయే ఎన్నికల్లో అను సరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

        33 జిల్లాల్లో కమిటీల ఏర్పాటు

    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆదివాసీ నాయకులు, మాజీ ప్ర జాప్రతినిధులను పంపించి 33 జి ల్లాల్లో జిల్లా కమిటీలను ఎంపిక చేయనున్నట్లు శంకర్ నాయక్ వెల్లడించారు. గ్రామస్థా యి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, కాం గ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కృ షి చేస్తామని తెలి పా రు. ఆదివాసీ నాయకుల భాగస్వామ్యంతో పార్టీ కార్యక్ర మాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.

     ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

    రానున్న హైదరాబాద్ రంగారెడ్డి, ఖమ్మం–వరంగల్–హైదరా బాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిల విజయానికి ఆదివా సీ నాయకులు, కార్యకర్త లు సమష్టిగా కృషి చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనే క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లు చేపట్టిందని శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్ప డిన అనంతరం 75 వేల ఉద్యో గాలను భర్తీ చేసినట్లు పేర్కొ న్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సం క్షే మాన్ని లక్ష్యంగా పనిచేస్తుంటే, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

    గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. బీజేపీ మతాల పేరుతో రాజకీయా లు చేస్తోందని విమర్శిస్తూ, ఆ రెండు పార్టీల వల్ల ప్రజలకు ప్ర యోజనం ఉండదని వ్యాఖ్యానించారు. కాం గ్రెస్ ప్రభుత్వం చే పడుతున్న అ భివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

      యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై వ్యాఖ్యలు

    యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ బడ్జెట్ తొలుత రూ.26 వే ల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ.36 వేల కోట్లకు చేరిందని శంకర్ నాయక్ పేర్కొన్నారు. అ యినప్పటికీ ప్రాజెక్టును పూర్తి చే సేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలి పా రు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డితో ఆదివాసీ నా యకుల సమావేశం జరగనుందని శంకర్ నాయక్ వెల్లడిం చా రు. ఈ స మావేశంలో ముఖ్యమంత్రి ఆది వాసీ నాయకులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.ఈ సమావేశంలో ఆదివాసీ వైస్ చైర్మన్లు లింగం నాయక్, హను మంతు నాయక్‌తో పాటు మోహన్, గణేష్, శ్రీనివాస్, చంద్రకళ, మల్లికార్జున్, మల్లీశ్వరి నాయక్, కోట్య నాయక్, తిరుమల నా యక్ తదితరులు పాల్గొన్నారు.

    MLC Ketavath Shankar Naik

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.