–24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి
–లేకుంటే పాదయాత్రలో నిరసనలు తప్పవ
Nalgonda DCC President Punna Kailash : ప్రజా దీవె న, నల్లగొండ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. జానారెడ్డి వ్యక్తి త్వం, రాజకీయ చరిత్రను కించప రిచేలా మాట్లాడటాన్ని తీవ్రం గా ఖండిస్తున్నానని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత స్ప ష్టం చేశారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు ఆయన బహిరంగ లే ఖ విడుదల చేశారు.ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజ కీయ ప్రస్థానం కలిగిన జానారెడ్డి అజాతశత్రువుగా ప్రజల్లో గు ర్తింపు పొందార ని కైలాష్ నేత పేర్కొన్నారు. హింసకు, హత్యా రాజకీయాలకు దూరంగా ఉంటూ నల్లగొండ జిల్లాలో ఆదర్శ వంతమైన రాజకీయ సంస్కృతిని నెలకొల్పిన నాయకుడని కొనియాడారు. ప్రత్యర్థులు సైతం సహాయం కోరితే ఆదుకునే మానవతావాది అని వివరించారు.
నక్సలైట్ల పునరావాసంలో కీలక పాత్ర
సాంబశివుడితో పాటు పలువు రు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో జానా రెడ్డి కీలకపాత్ర పోషిం చారని కై లాష్ నేత గుర్తుచేశారు. వారికి పునరావాసం కల్పిం చడంతో పాటు కేసుల పరిష్కారానికి కృషి చేసిన మానవ తావాదిగా నిలిచారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం తగదన్నారు.
బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యు న్నతికి జానారెడ్డి విశేషంగా కృ షి చేశారని కైలాష్ నేత పేర్కొన్నారు. తనలాంటి పేద బీసీ కు టుంబానికి చెందిన వ్యక్తికి నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి దక్కే లా ప్రోత్సహించింది కూడా జానారెడ్డేనని వెల్లడించారు. బాలు నాయక్, శంకర్ నాయక్, కొండేటి మల్లయ్య వంటి నాయకుల కు రాజకీయంగా మార్గదర్శకత్వం వహించారని తెలిపారు. బీ సీ రిజర్వే షన్ల అంశంలో జానారెడ్డిపై అసత్య ఆరోపణలు చే యడం సరికాదని, బహుజనుల పక్షాన నిలిచిన ఆయన సేవ లను గుర్తించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమ యంలో తీన్మార్ మల్లన్నకు జానారెడ్డి ఆర్థికంగా సహకరించిన విషయాన్ని కూడా మర్చిపోవద్దని ప్రశ్నించారు.
అభివృద్ధికి చిరునామా జానారెడ్డి
నల్లగొండ జిల్లా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చేందు కు పాలకులను ఒప్పించి అనేక అ భివృద్ధి పథకాలు తీసుకు రావడంలో జానారెడ్డి కీలక పాత్ర పోషించారని కైలాష్ నేత తె లిపారు. నిరాడంబర జీవనం, అవినీతి మరకలేని రాజకీయ ప్రస్థానం ఆ యన ప్రత్యేకతలని పేర్కొన్నారు.రాజకీయ ప్ర చా రం కోసం వ్యక్తిగ త విమర్శలకు దిగడం తగదని, బీసీల రాజకీ య ఐక్యతకు కృషి చేయాల్సిన సమయంలో సీనియర్ నాయ కులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకర మని అన్నా రు.
క్షమాపణ చెప్పకుంటే నిరసనలు
జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, ఆయ నకు, నల్లగొండ జిల్లా ప్రజలకు24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని పున్న కైలాష్ నేత డి మాండ్ చేశారు. లే నిపక్షంలో తీన్మార్ మల్లన్న చేపడుతున్న పాదయాత్రలో కాంగ్రె స్ కార్యకర్తలు, జానారెడ్డి అభిమానుల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తు న్నా రా? లేక బీసీల రాజకీయ భవి ష్యత్తును దెబ్బతీసేలా వ్య వహరి స్తున్నారా? అని ఆయన ప్రశ్నిం చారు. ఇకనైనా అసత్య ప్రచారా లు, వ్యక్తిగత విమర్శలు మాను కోవాలని హితవు పలి కారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, శాలిగౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజ య్, జిల్లా ఉపా ధ్యక్షుడు ఎండీ ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీం దర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, చ ర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, మట్టపల్లి నాగరాజ్, జ మ్మూ అశోక్, ఆకటి సైదులు, ఎం డీ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Nalgonda DCC President Punna Kailash


