Minister Uttam Kumar Reddy key Directions : ప్రజా దీవెన, హైదరాబా ద్:ఎల్‌నినో ప్రభావంతో రాబో యే రోజుల్లో వ్యవసాయ ఉత్ప త్తికి విఘాతం కలిగే అవ కాశాల నేపథ్యం లో తెలంగాణ ప్ర భుత్వం ఆహార భద్రత పై ముందస్తు చర్య లకు సిద్ధమవుతోం ది. రాష్ట్రంలో ప్ర జా పంపిణీ వ్యవస్థ (PDS )తో పాటు వివిధ సంస్థాగత అవసరాలకు ఎలాంటి కొరత లే కుండా కనీసం 15 నెల లకు సరిపడా సన్న బియ్యం నిల్వలను సిద్ధం చేయా లని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధి కా రులను ఆదేశించారు.బుధవారం పౌర సర ఫరాల శాఖ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పనితీరుపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎ ల్నినో కారణంగా వాతావరణ పరిస్థి తులు ప్రతికూలం గా మారినా, రాష్ట్రంలో ఆహార భద్రతకు ఎ లాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహ రించాలని సూచించారు.
మరో నెలకు ముందస్తు ఏర్పాట్లు
ప్రస్తుతం తెలంగాణలో సుమారు 14 నెలల అవసరాలకు స రి పడా నాణ్యమైన బియ్యం నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే రాబోయే వ్యవసా య సీజన్లపై అనిశ్చి తి నెలకొన్నందున నిల్వలను మరింత పెంచుకోవాల్సిన అవస రం ఉందని ఉత్తమ్ స్ప ష్టం చేశారు. సన్న బియ్యం పథకం ని రంతరాయంగా కొ నసాగేందుకు వరి సేకరణను వేగవంతం చే యాలని, నా ణ్యమైన ధాన్యం సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వా లని ఆదేశించారు.క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందేం దుకు అర్హత కలిగిన ఏడు సన్నరకాల వరి గురించి రై తులకు సేకరణ కేంద్రాల్లో విస్తృతంగా అవగాహన క ల్పించాలని సూ చించారు.
రేషన్ బుట్టలో మరిన్ని నిత్యావసరాలు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు మరిన్ని నిత్యా వసర వస్తువులను ప్రజలకు అందించే అంశంపై ప్రభుత్వం దృ ష్టి సారించింది. రేషన్ బుట్ట విస్తర ణకు సంబంధించి ఆర్థికంగా సాధ్యమయ్యే ప్రతిపాదన లు సిద్ధం చేయాలని మంత్రి అధికా రులను ఆదేశించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణం గా, భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడినా పేద, బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ ప థకాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రతిపాదనలను తొలుత కేబినెట్ ఉపసంఘం పరిశీలనకు తీసు కెళ్లనున్నట్లు వెల్లడించారు.
- 10 లక్షల మె.ట సామర్థ్యంతో ఆధునిక సైలోలు
రాష్ట్రంలో ధాన్యం సేకరణ భారీగా పెరుగుతున్నప్పటికీ, నిల్వ సదుపాయాలు అందుకు అనుగుణంగా అభివృ ద్ధి చెందలేద ని మంత్రి గుర్తుచేశారు. ప్రతి సీజన్లో ప్రై వేట్ రైస్ మిల్లులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడు తోందని పేర్కొన్నారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కా రంగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యంతో ఆధునిక సైలో ఆధారిత గోదా ములను నిర్మించే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఖ రీఫ్, రబీ సీజన్ల ధాన్యం సేకరణ పరిమాణాలను పరిగణనలో కి తీసుకుని పది ప్రధాన వరి సేకరణ క్లస్టర్లను గుర్తించి, అ క్క డ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించా రు.ఈ ప్రాజెక్టు కోసం అంతర్గత నిధులతో పాటు సంస్థాగత రు ణాలను కూడా పరిశీలించాలని, త క్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలిక రుణ చెల్లింపు గడువులు ఉండేలా ప్రణాళిక రూపొందించా లని సూచించారు.
బకాయిల వసూళ్లలో రాజీ లేదు
ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల విషయంలో మంత్రి కఠిన వైఖరి ప్రకటించారు. ప్రజాధ నాన్ని కాపాడే విషయంలో ఎలాంటి సడలింపులు ఉండబోవ ని స్పష్టం చేశారు. బకాయిల వసూ ళ్ల ప్రక్రియను మరింత వే గవంతం చేయాలని, చెల్లింపు లపై మిల్లర్లు ఇచ్చిన హామీలను అమలు చేయించాలని అధికారులను ఆదేశించారు. భవిష్య త్తులో మళ్లీ ఇలాం టి డిఫాల్ట్‌లు జరగకుండా పటిష్టమైన ఆర్థి క భద్రతా చ ర్యలు చేపట్టాలని సూచించారు.మొత్తంగా ఎల్ నినో ప్ర భావం, వ్యవసాయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని తె లంగాణలో ఆహార భద్రతను మరింత పటిష్టం చేయడం, సన్న బియ్యం నిల్వలను పెంచడం, రేషన్ వ్యవస్థను విస్తరించడం, ఆధునిక గోదాముల నిర్మాణం చేపట్టడం వంటి కీలక నిర్ణయా ల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు భారీకార్యాచరణ
ఐదునెలల్లో రూ.10 వేల కోట్లతో జలసంరక్షణ పనులు
హైదరాబాద్:వాతావరణ మార్పులు..ఎల్‌నినో ప్రభా వంతో రాబోయే రోజుల్లో ఎదురయ్యే కరువు సవాళ్లను ముందుగానే అంచనా వేసి ఎదుర్కొనేందుకు తెలంగా ణ ప్రభుత్వం భారీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. నీటి భద్రత, ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఐదు నెలల్లో ఏకంగా రూ.10 వేల కోట్లతో జల సంరక్షణ పనులు చేపట్టాలని ప్రణా ళిక రూపొందిం చిం ది. సంక్రాంతి తర్వాత ప్రతి నెలా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేలా కార్యాచరణ సి ద్ధం చేస్తోంది.వాతావరణ మార్పులపై హైదరాబాద్‌లో నిర్వ హించనున్న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్‌లో ఈ ప్రణాళిక ను ప్ర ధానంగా ప్రదర్శించనున్నారు. కాంక్లేవ్‌లో కేవలం చర్చలు, సి ద్ధాంతాలకే పరిమితం కాకుండా శాస్త్రీయంగా నిరూపి తమైన, క్షేత్రస్థాయిలో అమలు చేయగల పరి ష్కారాలను ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశా ఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్త మ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదే శించారు.
ఐదునెలల్లో రూ.10 వేల కోట్లతో జలసంరక్షణ
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ఐదు నెలల ఎల్‌నినో సన్నద్ధత కార్యక్రమం ఈ కాంక్లేవ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవ నుంది. నీటిపారుదల, పం చాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. ఇందులో భాగంగా చెరువులు, వాగులు, కా లువలపు నరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి సం రక్షణ, గ్రామీణ జల వనరుల పరిరక్షణకు విస్తృతంగా పనులు చేపట్టనున్నారు.వ్యవసాయ పనులు తగ్గే సమయంలో గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడం కూడా ఈ కార్య క్రమంలో మరో కీలక లక్ష్యంగా పె ట్టుకున్నారు. నీటి వనరుల ను పునరుద్ధరించడం తో పాటు భవిష్యత్తులో కరువు ప్రభావా న్ని తగ్గించేలా శాశ్వత పరిష్కారాలపై ప్రభుత్వం దృష్టి సారి స్తోంది.
తాగునీరు, ఆహార భద్రతకు ముందస్తు భరోసా
సంభావ్య కరువు పరిస్థితులు ఎదురైనా ప్రజలకు తాగు నీరు, ఆహార భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వచ్చే వర్షాకాలం వరకు జలాశయాల్లో నీ టి నిల్వలను కాపాడుకోవ డం అత్యంత కీలకమని పే ర్కొన్నారు.అధిక నీరు అవసరమ య్యే వరి సాగుకు బ దులుగా తక్కువ నీటితో పండించే ప్ర త్యామ్నాయ పం టల వైపు రైతులను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు దాదాపు ఏడా ది పాటు సరిపడే బియ్యం నిల్వలు రాష్ట్రంలో ఉన్నా య ని, పంట దిగుబడులు తగ్గినా ప్రజల ఆహార భద్రత కు ఇబ్బం ది లేకుండా ఈ నిల్వలు రక్షణగా నిలుస్తాయని తెలిపారు.
ప్రపంచ స్థాయి పరిష్కారాలపై దృష్టి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపం చవ్యాప్తంగా వాతావరణ ప్రతికూ లతలను సమర్థంగా ఎదు ర్కొన్న విజయవంతమైన నమూనాలతోపాటు ఇక్రిశాట్ గుర్తిం చిన ఉత్తమ వ్యవసా య, జల సంరక్షణ విధానాలను ప్రదర్శన ల్లో పొందుప రచాలని సూచించారు.కార్యక్రమ రూపకల్పన, నిపుణు ల భాగస్వామ్యం, పెట్టుబడిదారులతో సంప్రదింపులు, ఆడియో–విజువల్ ప్రదర్శనలపై సమీక్షలో చర్చించారు. ప్రత్యే క ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నికర శూన్య ఉద్గారాల దిశగా అడుగులు
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విస్తరణ, పరిశ్రమల్లో శుద్ధి చేసి న మురుగునీటి పునర్వినియోగం, నికర శూన్య ఉద్గారాల ల క్ష్య సాధనపైనా కాంక్లేవ్‌లో చర్చించను న్నారు. రాష్ట్రంలోని డే టా సెంటర్లు తమ విద్యుత్ అవ సరాల్లో కనీసం 51 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వ నరుల నుంచి సమకూర్చుకోవాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని అధికారులు వివరించా రు.
125 మంది గ్రామీణ ప్రతినిధులకు భాగస్వామ్యం
ఈ కాంక్లేవ్‌లో పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, నీటి సంర క్షణ రంగ ప్రతినిధులు, సామాజికవేత్తలు, పె ట్టుబడిదారు ల తోపాటు సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి భాగ స్వాములు కలిపి సు మారు 125 మంది గ్రామీణ ప్రతినిధులు పాల్గొననున్నారు. నీటి భద్రత, వాతావరణ మా ర్పులను తట్టుకునే వ్యవస్థలు, జీవవైవిధ్య పరిరక్షణ, పట్టణాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ని యంత్రణ, వ్యవ సాయం, స్వచ్ఛ ఇంధనం వంటి కీలక అంశా లపై విస్తృ త చర్చలు జరగనున్నాయి. పునరుత్పాదక ఇంధ నం, గ్రీన్ క్రెడిట్లు, పర్యావరణ పర్యాటకం, చక్రీయ ఆర్థిక వ్య వ స్థ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పెట్టుబడి దారుల వేదికను కూడా ఏర్పాటు చేయను న్నారు.మొత్తంగా ఎల్‌నినో ముప్పును ముందుగానే ఎ దుర్కొంటూ జలవనరుల సంరక్షణ నుంచి ఆహార భద్ర త వరకు సమగ్ర కార్యాచరణను అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర అభి వృద్ధిలో తెలంగాణను దేశానికి మార్గదర్శక రా ష్ట్రంగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
Minister Uttam Kumar Reddy key Directions


