Nalgonda BJP Organizational Strengthening : ప్రజా దీవెన,నల్లగొండ: భారతీయ జనతా పార్టీని నల్ల గొండ జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ జి ల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, రాబోయే కార్యక్రమాల నిర్వహణపై నాయకు లు సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహ సంఘటన మంత్రి దశరథ్ జీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు లు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి తోటపల్లి రవి, జిల్లా ఇన్‌చార్జి ఉదయ ప్రతాప్, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డా క్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కా ర్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పిలుపునిచ్చా రు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరిం చడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు.
గ్రామగ్రామాన పార్టీకి బలమైన పునాది
రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లాలో బీజేపీకి మరింత ప్రజాదరణ తీసుకురావాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నేతలు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల ని దిశానిర్దేశం చేశారు.పార్టీ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే రాజకీయ, సంస్థాగత కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించు కోవాలని సూచించారు.జిల్లాలో పార్టీ విస్తరణకు కార్య కర్తలే కీలక శక్తి అని నాయకులు పేర్కొంటూ, సమష్టి కృషితో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చే యాలని పిలుపునిచ్చారు.


