TPCC Disciplinary Committee sensational report : బిగ్ బ్రేకింగ్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కీలక సిఫార్సులు బహిర్గ తం, కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు వేయాలంటూ నివేదిక ?

TPCC Disciplinary Committee sensational report : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ కాంగ్రెస్‌లో క్రమశిక్ష ణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ సమర్పించిన నివేదికలో కీలక సి ఫార్సులు చే సినట్లు సమాచారం.మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, అ లాగే ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మ న్ చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని కమిటీ సూచిం చి నట్లు క్రమశిక్షణ సంఘం రూపొoదించిన నివేదిక వెల్లడి స్తోంది.ఈ ఇద్దరి వ్యవహారశైలి కారణం గా పార్టీతో పాటు ప్ర భుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని క్రమ శిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ఠను కాపాడేం దుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.కమిటీ సిఫార్సులపై కాం గ్రెస్ అ ధిష్టానం, రాష్ట్ర నాయక త్వం ఎ లాంటి నిర్ణయం తీ సుకుంటుంద న్నది ఇప్పుడు తె లంగాణ రాజకీయాల్లో ఆస క్తికరంగా మారింది. నివేదికపై చర్యలు తీసుకుంటే పార్టీ అం తర్గత రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసే అ వకా శం ఉంది.
వారిద్దరిపై వేటుకు రంగం సిద్ధo!
తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంత్రి కొండా సురేఖ ను క్యాబినెట్ నుంచి, ప్రణా ళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డిని పదవి నుంచి తొల గిం చాలని టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లు సమా చారం కాగా ఇప్ప టికే క్రమశిక్షణ కమిటీ తన నివేదికను టీ పీసీసీ అధ్యక్షుడు మహే ష్ కుమార్ గౌడ్‌కు సమర్పించింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి నివేదికను అందజేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నా రు.ఈ భేటీలో కమిటీ సిఫార్సులు, తదుపరి చ ర్యలపై చర్చ జరిగే అవకాశం ఉం ది. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క మిటీ చేసిన సిఫార్సుల నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు త దుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవి భేటీ అనంతరం ఈ వ్యవహారంపై మరిం త స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





