CM Revanth Reddy : ప్రజా దీవెన దేవరకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సభ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెం ట్స్ చేశారు. ప్రజా ప్రభుత్వం పంపి ణీ చేసిన ఇందిరమ్మ చీరలు కట్టుకొ ని సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్ర సంగం ఆయన మాటల్లోనే…
రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభి వృద్ధి రెండు కళ్ళు.గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డులో పేరు కూడా చేర్చలేదు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ ఉపయోగపడింది.దేశంలో తెలం గా ణ రాష్ట్రంలో మాత్రమే పేదలకు స న్న బియ్యం ఇస్తున్నాం. బీజేపీ పా లిత రాష్ట్రాలలో సన్న బియ్యం ఎం దుకు ఇవ్వడంలేదో చెప్పాలి.
ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దగ్గర మే ము ఓట్లు అడుగుతాం.డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిన చోట కేసీఆర్ ఓ ట్లు అడగాలి,ప్రజలే తీర్పు చెప్తారు.
పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్ రూ. 2వేల కోట్లతో గడీ మాత్రం కట్టుకు న్నాడు.ఆ పదేళ్లలో కాంగ్రెస్ అధి కారంలో ఉండి ఉంటే 22 లక్షల ఇళ్లు ఇచ్చేవాళ్ళం. ST లకు రిజ ర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్, కాంగ్రెస్ గిరిజనుల పార్టీ.
కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదు, ఫీజు, స్టార్టర్ కట్ చేసారు ప్రజలు.ఇద్దరు సర్పంచ్ లు, నలు గురు వార్డు మెంబర్ లతో కూర్చు న్నాడు.మీకు మంచి రోజులు కాదు, కొడుకు, అల్లుడు, బిడ్డలు ముంచే రోజులు వస్తాయి.నీ కొడుకు చాలు KCR నీ పార్టీని బొందపెట్టడానికి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అం దరికీ న్యాయం జరిగింది.SLBC ట న్నెల్ లో 10 కిలోమీటర్ లు తవ్వ లేని అసమర్థ పాలన BRS ది. SLB C టన్నెల్ కూలిన ప్రమాదంలో 8 మంది చనిపోతే BRS నేతలు పైశా చిక ఆనందం పొందుతున్నారు.
SLBC నీ పూర్తి చేస్తాం.పెండింగ్ సా గునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.
దేవరకొండ అభివృద్ధికి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ను దేవరకొండకు పంపిస్తా.నర్సింగ్ కాలేజీ ప్రతిపా దనలు సిద్ధం చేయండి.జూనియర్ కాలేజీ అభివృద్ధికి కావలసిన ని ధులు విడుదల చేస్తా.10 ఏళ్లు న ష్టపోయాo, 10 ఏళ్లు కష్టపడ్డాం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది.రాష్ట్రాన్ని దేశం లోనే నెంబర్ 1 చేసితెలంగాణ మో డల్ ను దేశవ్యాప్తం చేస్తాం.
మంచి వాళ్ళను సర్పంచ్ గా ఎన్ను కోండి.మంత్రితో కలిసి ఉండేవాళ్ళు, MLA తో కలిసి పని చేసే వాళ్లకు స ర్పంచ్ గా అవకాశం ఇవ్వండి. ఇంది రమ్మ చీరలను వాళ్ల ఇంటికే పంపి స్తా. ఆ చీరలు కట్టుకొని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిం చాలని పిలుపునిచ్చారు.
దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ కి అడ్డా అని కార్యకర్తలు నిరూపించా రు.రెండేళ్ల క్రితం ఓటునే ఆయుధంగా మార్చి పదేళ్లు తెలంగాణ ను పట్టి పీడించిన నాయకుల గడీలను ఓటు అనే ఆయుధంతో కుప్ప కూల్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. నల్గొండ జిల్లాకు చైతన్యం ఉం ది, ఇక్కడి గాలికి, నీరు కు పోరాట పౌరుషం ఉంది. నిజాం నవా బుకు వ్యతిరేకంగా భూమి కోసం ,భుక్తి కోసం,విముక్తి కోసం సాయు ధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి తరిమికొట్టిన ప్రాంతం ఇది..
సోనియా గాంధీ త్యాగం , అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితో తెలంగాణ రాస్ట్రానికి ఏర్పాటు చేసకున్నాం. ప్రజా పాలనతో సంక్షేమం, అభి వ్రుద్ది ని రెండు కళ్లతో ముందుకు వెళ్తున్నాం..10 యేళ్లలో పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పో యింది. ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా రేషన్ కార్డు ఇవ్వ లే దు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం..
దేవరకొండలో నే 14 వేల రేషన్ కార్డులు మంజూరు చేశాం..50 లక్ష ల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని బర్ల పెట్టే వారు..రేషన్ దుకాణం దగ్గరే అమ్ముకునే వారు..ప్రజా ప్రభుత్వంలో మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలు సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు.. పేదవాడికి న్యాయం జరగాలన్నదే ఇందిరమ్మ రాజ్యం ఆకాంక్ష..

దేశంలో నరేంద్ర మోదీ పాలిత గుజరాత్ తో సహా బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు.. తెలంగాణలోనే స న్న బియ్యం ఇస్తు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం..2004 నుంచి 14 వరకు వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. తెలంగాణ వస్తే డబల్ బెడ్రూం ఇళ్లు ఇ స్తామని ఒకాయన నమ్మబలికాడు..
డబుల్ బెడ్రూం ఇచ్చిన ఊరిలో మీరు ఓటు అడగాలి, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊర్లో మేం ఓటు అడుగుతామని ఎన్నికల సమయం లో సవాల్ విసిరాం..ఆ నాటి పాలకులకు పేదల పట్ల ఏ మాత్రం అభిమానం లేదు. 2000 కోట్లు ఖర్చు పెట్టి పదెకరాల లో 150 గదుల గడీని నిర్మించుకున్నాడు..ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 22 వేల కోట్లతో రాష్ట్రం లో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మి స్తున్నాం..
కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉంటే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే వాళ్లం. చెంచులు,గిరిజనుల ఉన్న ప్రాంతంలో అద నంగా 25 వేల ఇళ్లు ఇచ్చాం.ఆదివాసీ,లంబాడీలు, గిరిజనులది ఈ ప్రభుత్వం..లంబాడీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. లంబా డీలను ఎస్టీల్లో చేర్చడానికి జైపాల్ రెడ్డి ఎంతో క్రిషి చేశారు..లక్ష రూ పాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు..
25 లక్షల 35 వేల రైతు కుటుంబాలకు 20 వేల కోట్ల రుణమాపీ చేశాం. వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూ పించాం. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు.. రైతు బంధు రాదని కేసీఆర్ అన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా ఉచిత కరెంటు ఫైల్ పైన సంతకం చేశారు..ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది..
రైతులకు కాదు కేసీఆర్ ఇంట్లో కరెంటు లేదు, జనం పీజులు పీకే శారు..కాని రాష్ట్రంలో రైతుల కు మాత్రం కరెంటు ఉంది..ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్ల ను కూర్చోబెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారు..మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్తు న్నా డు. కేసీఆర్ కు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి..కొడుకు, బిడ్డ, అల్లుడు తెలంగాణ ను నాలుగు వైపుల నుంచి పీక్కు తి న్నారు..
8 లక్షల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీరలేదా..?అసెంబ్లీ ఎన్న కల్లో బీఆర్ఎస్ కు అధికారం పోయింది,పార్లమెంటు లో గుండు సున్నా వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకలేదు.. జూ బ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోరబండ దగ్గర బీఆర్ఎస్ ను బం డకేసి కొట్టారు..కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలకు మంచి రోజు లు వచ్చాయి..
మంచి పాలనలో ప్రజలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బి య్యం, రేషన్ కార్డు ఇలా ఎన్నో సంక్షేమాలు వచ్చాయి.. తెలంగా ణలో రెండేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం..ఎస్ ఎల్ బీసీ కోసం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ఎస్ ఎల్ బీసీ ను పగపట్టి , నల్గొండ ప్రజలపై కక్ష కట్టి పడావు పెట్టారు..
ఎస్ ఎల్ బీసీ లో ప్రమాదవశాత్తు 8 మంది చనిపోతే మామ అ ల్లుళ్లు పైశాచిక ఆనందంతో డ్యాన్స్ లు చేశారు…కేసీఆర్ , ఆయన అల్లుడు నాగార్జున సాగర్ , శ్రీశైలం లో బండ కట్టుకుని దూకినా ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేస్తాం..దేవరకొండ రైతుల కోసం డిండి ప్రాజెక్టు పూర్తి చేశాం..దేవర కొండ ప్రాంతాన్ని అభివ్రుద్ది చేయించే బాధ్యత మా ప్రభుత్వానిదే..దేవరకొండలో జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాలకు 6 కోట్ల నిధులు ఇస్తా..
వెంకటేశ్వరస్వామి టెంపుల్ ను పూర్తి చేసే బాధ్యత నాదే.. దేవర కొండ కు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తాం..రాబోయే 10 యేళ్లు అధికారంలో ఉంటాం.. దైర్యంగా ఉండాలి…అభివ్రుద్ది పథంలో నడిపిస్తాం..దేవరకొండ లో రోడ్ల నిర్మాణం పైన ద్రుష్టి సారిస్తాం.. ఈ నెలాఖరు లోపు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ , సీతక్క ను పంపిస్తా మద్దిమడుగు లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయి స్తాం..పుణ్యక్షేత్రం గా మద్దిమడుగు ను అభివ్రుద్ది చేస్తాం..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేస్తున్నాం.. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తాం.వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేశాం..గంజాయి నిర్మూలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేశాం..విద్య, వైద్యంలో తెలంగాణను దేశం లోనే నెంబర్ 1 చేస్తాం..దేశంలో నే తెలంగాణ మోడల్ ను ప్రక టిం చి నెంబర్ 1 గా నిలబెడతాం..గ్రామాల్లో సర్పంచ్ ను మంచి వాళ్ల ను ఎన్నుకోవాలి..తెలంగాణలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణి చేశామన్నారు.



